రెడ్డబోయిన తిరుపతి, గాండ్లభాస్కర్‌ (సిద్దిపేట జిల్లా,విఠలాపూర్‌) ఇంటర్‌ చదివి నిరుద్యోగులుగా ఉండిపోయారు.
ఉపాధి లేక రోజూ కూలీలుగా మారాలనుకున్నారు… అలాంటి సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో స్కిల్‌డెవలప్‌ మెంట్‌లో శిక్షణ ఇస్తున్నారని తెలిసి అక్కడ నెల రోజులు ఉండి కొంచెం నైపుణ్యం పొందారు. వారి జీవితంలో మార్పు మొదలైంది. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ఏరో బ్రిడ్జిఆపరేటర్లగా ఉద్యోగాలు వచ్చాయి. విమానం రాగానే బ్రిడ్జిని దానికి చేరువ చేయడం వారి పని. రోజుకు 8గంటల డ్యూటీ. నెలకు 10,500 జీతం. వారానికి రెండు రోజులు సెలవు. మొన్నటి వరకు ఊర్లో ఎవరూ పట్టించుకోని వారు నేడు మనోళ్లు ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం చేస్తున్నారని గౌరవంగా చూస్తున్నారు.
శిక్షణ ఇచ్చేది ఎవరు? 
ఆసరా అందిస్తే అందలాన్ని అందుకోగలిగే యువతీ,యవకుల  కోసం ఉచితంగా ఉపాధి శిక్షణ అందిస్తోంది ‘జిఎమ్‌ఆర్‌ వరలక్ష్మీ ఫౌండేషన్‌’ (జిఎంఆర్‌విఎఫ్‌).
 ఏటా 800మందికి ఉపాధి 
దశాబ్ద కాలంగా సుమారు 7,500 మంది యువతీయువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. ప్రతిఏటా దాదాపు 800 మంది ఉచిత శిక్షణ పొందుతున్నారు. అలా శిక్షణ పొందిన వారిలో కొందరు స్వయంగా ఉపాధి కల్పించుకుంటున్నారు. మరికొందరు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు.
 నైపుణ్య శిక్షణ ఎలా..? 5వతరగతి నుండి ఇంటర్‌ మీడియట్‌ వరకు ఎవరికి అవసరమైన వృత్తి విద్యలో వారికి శిక్షణ ఉంది. 18నుండి 30సంవత్సరాల వయసు గల యువతీ యువకులు అర్హులు. అభ్యర్దులకు శిక్షణతో పాటు, ఉద్యోగాలు పొందడానికి వీలుగా సాఫ్ట్‌ స్కిల్స్‌లో కూడాశిక్షణ ఇస్తారు. 
అంతా ఉచితమే.. 
శిక్షణ పూర్తి ఉచితం.వసతి, ఆహారం ఇవ్వడమే కాకుండా యూనిఫామ్‌, కోర్సుకు సంబంధించి పుస్తకాలు,పరికరాలు ఇస్తారు. మూడు నెలల పాటు శిక్షణ తీసుకోవాలి. తర్వాత సంస్థ ప్రతినిధులే వీరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటారు. ఉద్యోగులు కావాల్సిన సంస్థల జాబితా నిర్వాహకుల దగ్గర ఉంటుంది. వీరు ఆయా జాబితాలోని సంస్థలను సంప్రదించి తమ వద్ద శిక్షణ పొందిన వారి వివరాలు ఇచ్చి ఉద్యోగం ఇప్పించేందుకు సహకరిస్తారు. 
 కనీసం ఎనిమిదో తరగతి చదివి 18సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువకులు అర్హులు. వీరికి ఉచిత హాస్టల్‌ వసతి కల్పించండంతోపాటు మూడు నెలల పాటు నిపుణులతో శిక్షణ కల్పిస్తారు. శిక్షణ కాలంలో యోగా, క్రీడలు, వ్యక్తిత్వ వికాసం, కరాటే, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ విద్య వంటి అంశాల్లో నిపుణులచే మెలకువలు నేర్పిస్తారు.
శిక్షణ ఎక్కడ?
 శంషాబాద్‌ సమీపంలో జియంఆర్‌ వరలక్ష్మి సెంటర్‌ ఫర్‌ ఎంపవర్‌ మెంట్‌, లైవ్‌లీహుడ్స్‌, ఎయిర్‌ పోర్ట్‌ క్యాంపస్‌,చిన్మయి స్కూల్‌ దగ్గర, మామిడిపల్లి రోడ్‌,శంషాబాద్‌. శంషాబాద్‌ ఆర్టీసీ బస్‌స్టాండ్‌ ఎదురుగా మామిడిపల్లి గ్రామానికి వెళ్లే ఆటోలు ఎక్కి జీఎంఆర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కి అంటే తీసుకెళ్తారు. మరిన్ని వివరాలకు 9494800102, 8919890976, 9985574742 కి కాల్‌ చేయవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: