ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదలైంది.మొత్తం నాలుగు ట్రిపుల్ ఐటీలైన నూజివీడు, ఆర్ కె వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీలకు 4000 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. పదవ తరగతి చదివి మొదటిసారి పాసైన విద్యార్థులు దీనికి అర్హులు. ఇందులో ఎంపికయిన విద్యార్థులకు ఆరు సంవత్సరాల ఇంటిగ్రెటెడ్ ( ఇంటర్+ బీ టెక్) కోర్సు పూర్తి చేయవలసి ఉంటుంది. 
 
ఏపీ ఆన్ లైన్ కేంద్రాల ద్వారా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ధరఖాస్తు చేయవచ్చు. తెలంగాణ లోని ఒకే ఒక ట్రిపుల్ ఐటీ అయిన బాసరలో గత నెలే నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉండటంతో నోటిఫికేషన్ ఆలస్యంగా విడుదలైంది. తెలంగాణలో ఆరు నెలల క్రిందటే అసెంబ్లీ ఎన్నికలు పూర్తవడంతో నోటిఫికేషన్ త్వరగా విడుదలైంది. 
 
ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి సర్టిఫికేట్ల పరిశీలన తరువాత విద్యార్థులకు కోర్సులో చేరడానికి అనుమతిస్తారు. రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీలలో ట్రిపుల్ ఐటీలు ప్రముఖ స్థానంలో ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఈ కాలేజీలో చేర్చడానికి ప్రాముఖ్యతనిస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: