నిట్ (నేషన్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వరంగల్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ
నోటిఫికేషన్ లో భాగంగా 135 టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కోసం అర్హులైన అభ్యర్ధుల
నుంచీ దరఖాస్తులని కోరుతోంది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి పలు పోస్టులు భర్తీ
చేయనున్నట్టుగా నోటిఫికేషన్ లో తెలిపింది.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్
ప్రొఫెసర్ గ్రేడ్-1,2,3.
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, మెటలర్జికల్ అండ్
మెటీరియల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్ అండ్
సోషల్ సెన్సైస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్.
అర్హత: పోస్టులను
బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష/సెమినార్, ఇంటర్వ్యూ
ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు).
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: జులై
5, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.nitw.ac.in