భద్రాద్రి జిల్లా కొత్తగూడెం లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 4 ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ పోస్టులని భర్తీ చేయనుంది.

 Jobs

విభాగాల వారీ ఖాళీలు: జనరల్‌ మేనేజర్‌–1, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (సేఫ్టీ)–1, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (ఆష్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌)–1, సూపరింటెండెంట్‌–1.

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.

వయసు: 2019, మార్చి 31 నాటికి 42–52 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: జూన్‌ 17, 2019.

హార్డ్ కాపీలు పంపడానికి చివరితేదీ: జూన్‌ 24, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌https://scclmines.com


మరింత సమాచారం తెలుసుకోండి: