వానమ్మా ...రావమ్మా 
నీటిచుక్క కరువై, జీవనాధారమైన పంటలు, పశువులు, విలవిల్లాడుతుంటే రైతు మనసు ఎంతగా తల్లడిల్లు తుందో చెప్పలేం. పోలవరాలు,కాళేశ్వరాలు ప్రతీ మూలకు నీళ్లు అందించ లేవు. మన దేశంలో యాభై శాతం భూములకు పైనుండి పడే వర్షమే ఆధారం!!

ఈ రైతులు చిన్న ఉపాయంతో నీటి వనరులు ఎండిపోకుండా, వాన నీటిని భూమి లోపలకు ఇంకింపజేస్తే , అన్నికాలాల్లో నీటికి కొదవ లేకుండా పాడి, పంటలతో కళకళలాడ వచ్చు అంటాడీ రైతు.

 '' కోట్ల రూపాయలు ఖర్చుతో భారీ సాగునీటి ప్రాజెక్టులు కట్టక్కర్లేదు.కొన్ని వందల రూపాయల ఖర్చుతో ఇలా ప్రతీ రైతు పొలం చుట్టూ, కందకాలు తవ్వుకుంటే ఇపుడు కురిసిన వాన ఇక్కడ ఇంకడమే కాక నేల సారం కూడా కొట్టుకు పోదు...'' అని మాకు చెప్పాడు Boya Ranga Swani ,kotakonda village,  కర్నూల్‌ జిల్లా యువ కర్షకుడు.
 ఇతడి విజయ ప్రస్ధానం ఏపీ రూరల్‌ డెవలప్‌మెంట్‌ తెలుగు,ఆంగ్లంలో ప్రచురించిన కాఫీ టేబుల్‌ బుక్‌లో చోటు చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: