యువతకు ఒక వినూత్న అవకాశం కల్పిస్తోంది , హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్‌ ఐటీ కంపెనీ . ఇంటర్మీడియట్‌ పూర్త చేసిన స్టూడెంట్స్‌ కోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూ ద్వారా శాశ్వత ప్రాతిపదికన ఎంపిక చేసుకుంటుంది. ఆ తర్వాత వారికి తమ కంపెనీ అవసరాలకు తగ్గట్టు శిక్షణ ఇప్పిస్తుంది. ఫీజు 2 లక్షల రూపాయలు. ఎంపికైన వారికి బ్యాంక్‌ లోన్‌ సదుపాయం కూడా ఉంది. ఎంపికైన వారికి నెల నెలా స్టయిఫండ్‌ కింద 10, 000 వేల రూపాయలు ఇస్తుంది.

 హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ టెక్‌ బీ అని ఈ ప్రోగ్రాంకు పేరు పెట్టింది. రెండేళ్ల పాటు ట్రైనింగ్‌ ఇస్తారు. ఉత్తర ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లోని తమ కంపెనీ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో వీరికి బోధన, ప్రాక్టికల్స్‌ ఉంటాయి. భోజన వసతి సౌకర్యం కంపెనీ చూసుకుంటుంది. శిక్షణ అనంతరం తమ కంపెనీలోనే వీరికి వివిధ విభాగాలలో, వారి ప్రతిభ ఆధారంగా ఉపాధి కల్పిస్తారు.

 అందరూ చదువు అయిపోయాక వేతనాలు పొందుతారు. కానీ ఇక్కడ అలా కాదు..వేతనం తీసుకుంటూనే తమకు ఇష్టం వచ్చిన కోర్సుల్లో చదువుకుంటారు. చదువుతూనే, ఉద్యోగం నిర్వహిస్తారు. ఇది ఒకరకంగా ఇంటర్నిషిప్‌ గా పనికి వస్తుంది. ఇంటర్‌ పూర్తి చేసిన వారు తప్పనిసరిగా 60 శాతం మార్కులు పొంది వుండాలి.

ఇందులో సెలెక్ట్‌ అయిన విద్యార్థులకు బిట్స్‌ పిలాని, శస్త్ర యూనివర్శిటీలు శిక్షణ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని వెల్లడించారు. ట్రైనింగ్‌ అనంతరం ఏడాదికి రెండున్నర లక్షల జీతం అందుతుందని సంస్ధ తెలియ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: