నానాటికి దిగజారుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు ఈనెల 29న న హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్ డి) క్యాంపస్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు మహా భారత్ అభియాన్ గ్రామోదయ మిషన్ పేర్కొంది.

శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  మహాన్ భారత్ అభియాన్ ప్రతినిధులు నారాయణ చార్యులు, మాజీ ఐఏఎస్ అధికారిణి చందనాఖాన్, నిజాం నవాబు మనవడు, సంస్థ Brand ambassador రౌనక్ యార్ ఖాన్, సీనియర్ పాత్రికేయులు షరీఫ్ మహమ్మద్,బుద్వేల్ మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణ రావు మాట్లాడారు. భారతదేశాన్ని పన్ను రహితంగా అప్పులు లేని దేశంగా తీర్చిదిద్దడం, గ్రామీణ ప్రాంతాలలోని రైతు కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, అడుగంటుతున్న భూగర్భ జలాల ను అభివృద్ధి పరచడం, గ్రామాలకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చే అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

ఈ సమావేశానికి *ముఖ్య వక్తగా చినజీయర్ స్వామి హాజరై మాట్లాడతారని తెలిపారు*. అభియాన్ ప్లానింగ్ కమిటీ కన్వీనర్ అశోక్ కుమార్,  చందనాఖాన్ లతోపాటు పలువురు ప్రముఖులు హాజరై ఆయా అంశాల మీద చర్చిస్తారని చెప్పారు.  ప్రపంచీకరణ, పట్టణీకరణతో  గ్రామాలు స్వయం సమృద్ధిని కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

యావత్ దేశానికి అన్నం పెట్టాల్సిన రైతులు వ్యవసాయానికి దూరమై పట్టణాలలో కార్మికులుగా మిగిలిపోవడం విచారకరమన్నారు. ఇలాంటి వాటిని ని పూర్తిగా నిర్మూలించే ఉన్నత లక్ష్యంతో గ్రామోదయ్ మిషన్ ప్రారంభమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి సమావేశాన్ని గత నెల 4న మైసూర్ లో నిర్వహించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ సమావేశాలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి బాటలు వేయనున్నట్టు వారు పేర్కొన్నారు.  .


మరింత సమాచారం తెలుసుకోండి: