ప్రభుత్వ పాఠశాలలా..! పాఠాలు బాగా చెప్తారా..! పిల్లల్ని సరిగా పట్టించుకుంటారా..! వసతులు సరిగా ఉంటాయా..! ఇవే అనుమానాల మధ్య ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తునే ఉన్నాయి.. చదివే వారు చదువుతున్నారు. తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజులు కడుతూ పిల్లల్ని ప్రైవేటు స్కూల్స్ కే పంపిస్తున్నారు. అయినా అక్కడ చదువు అంతంతమాత్రమే. కానీ.. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలుగుతోంది. ఇందుకు తాజా ఉదాహరణలు.. నెల్లూరు లోని కేఎన్ ఆర్ ప్రభుత్వ పాఠశాల, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణంలోని కొత్తయిండ్లు మున్సిపల్‌ హైస్కూల్. సినిమా హాల్ కు హౌస్ ఫుల్ బోర్డు పెట్టినట్టు.. తమ పాఠశాలలో అడ్మిషన్లు లేవు అని బోర్డు పెట్టారు ఈ పాఠశాలల ఉపాధ్యాయులు. తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్ల కోసం క్యూ కట్టడంతో ఆశ్చర్యపోవడం ఉపాధ్యాయుల వంతవుతోంది. వినడానికి, చదవడానికి ఇది ఆశ్చర్యంగా ఇది నిజం. తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక వారు ఈ బోర్డు పెట్టారు.

నెల్లూరులోని కురుగంటి నాగిరెడ్డి అనే దాత పేరు మీద ఉన్న ఈ మున్సిపల్ పాఠశాల ప్రైవేటు స్కూల్స్ కు దీటుగా, పోటీగా ఉత్తమ ఫలితాలతో ముందుకు సాగుతోంది. పాఠశాలలోని ఉపాధ్యాయుల అంకిత భావం, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికే కేఎన్‌ఆర్‌ మునిసిపల్‌ పాఠశాల విజయ రహస్యం. దీంతో పాఠశాల జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది. 1992లో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 287. ఇప్పుడు 1300 మంది విద్యార్థులు ఉన్నారు. స్థానికంగా ఉండే పూర్వ విద్యార్థులు పాఠశాలకు వచ్చి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు.

ఇటువంటిదే చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణంలోని కొత్తయిండ్లు మున్సిపల్‌ హైస్కూల్ పరిస్థితి కూడా. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు చెప్పే విధానం, ఫలితాలు మెరుగ్గా రావాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారుతోంది. మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కూడా ఇందుకు దోహదపడుతోంది. దీంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. ఫలితాలు కూడాప్రైవేటు స్కూల్స్ కు దీటుగా ఉండడం ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకానికి ఉదాహరణలు.

గతానికి భిన్నంగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగవడం ఎంతో అభినందించదగ్గ విషయం. ప్రజలను ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపేందుకు ప్రభుత్వుద్యోగులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించడం కూడా ఒక కారణం. ఇటివల ఒక తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కలెక్టర్ తమ కూతురిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం మనకు తెలిసిందే. వీరే కాకుండా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ఉపాధ్యాయుల బోధనా పద్దతిలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఏటికేడు పెంచేస్తున్న ఫీజులతో ప్రజలను దోచేస్తున్న ప్రైవేటు పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా అనేక మార్పులు రావల్సిందే. ఇందుకు ప్రభుత్వం అమ్మఒడి వంటి పథకాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతులు పెంచడం వంటి మార్పులకు శ్రీకారం చుట్టడమే


మరింత సమాచారం తెలుసుకోండి: