వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలికంగా 3వేల వైద్యులు, నర్సులు, పారామెడికల్ సహా ఇతర పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. నర్సులు, పారామెడికల్ సహా ఇతర పోస్టులను భర్తీ చేయాలని..ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులకు సూచించారు. 


2017-18లో సుమారు 4 వేల పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో స్టాప్ నర్సు,, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్‌తో సహా పాలు పారామెడికల్ పోస్టులున్నాయి.హైకోర్టులో వీటిపై పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో రెండేండ్లుగా భర్తీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఉద్యోగుల కొరత అధికంగా ఉంది.


దీంతో తెలంగాణ‌లో గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల వైద్యం అందించే ప‌రిస్థితి లేద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ పోస్టుల‌ను భర్తీ చేయాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. దీంతో తాత్కాలిక ఉద్యోగులతో వీటిని భ‌ర్తీ చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీల భర్తీ అవశ్యకతను అధికారులు మంత్రి ఈటలకు వివరించారు. ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ నివేదించాక..అక్కడి నుంచి అనుమతి వచ్చాక వీటి భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: