తాజాగా హిందుస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్(HCL)..వినూత్న ప్రోగ్రామ్‌కి తెరలేపింది. స‌హ‌జంగా ఇంటర్ మీడియట్ తర్వాత..ఏదో డిగ్రీ చేయడం..లేదా ఎంసెట్ రాయడం..ఇంజినీరింగ్ చేసి కొలువు కోసం ఎదురు చూడడం ఇదంతా కామన్ అయిపోయింది. అయితే ఇంటర్ పూర్తవుతూనే ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగంతో పాటు పేరున్న ఇనిస్టిట్యూట్‌లో చదువుకొనే అవకాశం లభిస్తే..ఎలా ఉంటుంది. ఇప్పుడు అలాంటి అవ‌కాశం HCL సాఫ్ట్ వేర్ కంపెనీ క‌ల్పిస్తుంది. 


ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు సరైన శిక్షణ అందిస్తే ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా రాణించగలరనే నమ్మకంతో హెచ్‌సీఎల్ సరికొత్త కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టింది. ప్రధానంగా హెచ్‌సీఎల్ కేంద్రాలున్న రాష్ట్రాల్లో కూడా టెక్ బీ ప్రోగ్రాంను స్టాట్ చేశారు. 
అర్హులు: ఇంట‌ర్‌లో 60 శాతం మార్కులు.. తత్సమాన కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు అర్హులు. ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ సమీపంలో ఉన్న హెచ్‌సీఎల్ క్యాంపస్ లేదా ఎంపిక చేసిన కేంద్రం వద్ద కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. 


- కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం విద్యార్థులతో ఎంపిక కమిటీ ముఖాముఖి నిర్వహిస్తుంది. ఆ త‌ర్వాత ఆన్ లైన్ ఎగ్జామ్ ఉంటుంది.


- HCL లో ఉద్యోగం పొందిన తర్వాత తొలి ఏడాది నుంచి ఫీజును వాయిదాల రూపంలో చెల్లించాలి. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఫీజులో రాయితీలు కల్పిస్తారు.


- అలాగే 90 శాతం కంటే ఎక్కువ స్కోరు చేస్తే వారికి పూర్తి స్థాయి రాయితీ (ఫీజులో), 85 - 90 శాతం మధ్య స్కోరు చేసిన స్టూడెంట్స్‌కు విద్యార్థులకు 50 శాతం రాయితీ ఇస్తారు.


- కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే సంపాదించేలా కార్యచరణను రూపొందించారు. రూ. 10 వేల స్టయిఫండ్ ఇస్తారు. మొత్తం 12 నెలల పాటు శిక్షణ ఇస్తారు. మొదటి 9 నెలలు క్లాస్ రూమ్, ఆ తర్వాత మూడు నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. వివిధ రకాల్లో శిక్షణ అందిస్తారు. 


- ఇక విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని కంపెనీలో అప్లికేషన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట, టెస్టింగ్, క్యాడ్ సపోర్టు విభాగాల్లో నియమిస్తారు. వీరికి రూ. 2 లక్షల నుంచి రూ. 2.2 లక్షలు శాల‌రీ ప్రారంభం అవుతుంది.


టెక్..జీ ముఖ్యాంశాలు : - 
అర్హత : ఇంటర్ 
కాల వ్యవధి : 12 నెలలు
కోర్సు ఫీజు : రూ. 2 లక్షలు
స్టయిఫండ్ : నెలకు రూ. 10 వేలు.
బిట్స్ పిలానీ, శాస్త్ర యూనివర్సిటీల్లో కోర్సులు
వెబ్ సైట్ : www.hcltechbees.com


మరింత సమాచారం తెలుసుకోండి: