భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకి చెందిన న్యూఢిల్లీ లోని ససస్త్ర సీమాబల్ లో కానిస్టేబుల్ ఉద్యోగాలకి నియామక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో మాత్రమే భర్తీ చేయనున్నారు. మొత్తం 150 ఉద్యోగాలని భర్తీ చేయనున్నట్లుగా నోటిఫికేషన్ లో తెలిపారు. పోస్టుల వివరాలలోకి వెళ్తే..

Jobs
జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ గ్రూప్ సీ : 150.
అర్హత: మెట్రిక్యులేషన్ తత్సమాన ఉత్తీర్ణత , 2017  జనవరి 1 తరువాత దేశం తరుపున అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడం లేదా గత ఒలంపిక్ గేమ్స్ , ప్రపంచ కప్ , ఆసియన్ గేమ్స్ లో పాల్గొని ఉన్నవాళ్ళు అర్హులు.

 వయసు: 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం: బయోమెట్రిక్ ఎగ్జామినేషన్, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్, ఫీల్డ్ ట్రయల్, ఫిజికల్‌స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్‌ల ద్వారా ఎంపిక జరుగుతుంది. 

దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

రఖాస్తు గడువు: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (జులై 13-19)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. 


పూర్తి వివరాలకు వెబ్‌సైట్https://ssb.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: