భారత
ప్రభుత్వంచే నడపబడుతున్న అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్. భారత్
లో ఉన్న సంస్థల్లోకెల్లా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అత్యుత్తమ సంస్థగా నిలిచింది.
ఈ సంస్థకి చెందిన సదరన్ రీజియన్ దాదాపు 413 ట్రేడ్
అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాలీలకి గాను అర్హులైన
అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులని కోరుతోంది.
పోస్టుల వివరాలు..
1. ట్రేడ్ అప్రెంటీస్ - 353
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ
ఉత్తీర్ణులై ఉండాలి.
2. టెక్నీషియన్ అప్రెంటీస్ : 60.
అర్హత: సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా
ఉత్తీర్ణత.
వయసు: 2019, జూలై 31 నాటికి
18-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు
మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీడబ్ల్యూడీలకు
పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవాలి.
ఆఖరుతేదీ : ఆగస్టు 7, 2019.
పరీక్షతేదీ: ఆగస్టు 18, 2019.
మరిన్ని వివరాలకై సంస్థ వెబ్సైటు చూడవచ్చు : www.iocl.com