ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామక రాత పరీక్షల నిర్వహణ తేదీలనురాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కొన్ని పోస్టులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పోస్టులకు ప్రధాన పరీక్షలను, మరికొన్ని ఉద్యోగాలకు నేరుగా ఒకే పరీక్షను నిర్వహిస్తూ షెడ్యూల్ ను విడుదల చేసింది.

వివరాల్లోకి వెళితే...అటవీ రేంజ్ అధికారి పోస్టుకు అక్టోబర్ 22, 23, 24 తేదీల్లో, డివిజనల్ అకౌంట్స్ అధికారి పోస్టుకు అక్టోబర్ 24, 25 తేదీల్లో, పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు నవంబర్ 20, 21, 22, 23 తేదీల్లో, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు నవంబర్ 28, 29, 30 తేదీల్లో, జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2020 జనవరి 19, 20, 22, 23 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.


ఇక గెజిటెడ్ పోస్టుల పరీక్షల వివరాలకు వస్తే, సహాయ బీసీ, సాంఘిక, గిరిజిన సంక్షేమ అధికారి పోస్టులకు నవంబర్ 5, 6న పరీక్షలు జరగనున్నాయి. ఏపీ బీమా వైద్య సేవల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నవంబర్ 6న, జిల్లా సైనిక సంక్షేమ అధికారి, పట్టణ, ప్రణాళిక విభాగం పోస్టులకు, సంచాలకుల పోస్టులకు, భూగర్భ జల సేవల విభాగంలో సహాయ కెమిస్టు పోస్టులకు నవంబర్ 6, 7 తేదీల్లో, పట్టణ ప్రణాళిక సహాయకుల పోస్టులకు నవంబర్ 6, 8 తేదీల్లో, మైనింగ్ రాయల్టీ ఇన్ స్పెక్టర్  టెక్నికల్ అసిస్టెంట్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పోస్టులకు నవంబర్ 6న పరీక్షలు జరగనున్నాయి.


ఇదిలావుండగా, నాన్ గెజిటెడ్ పోస్టుల వివరాల్లోకి వెళితే, టెక్నికల్ అసిస్టెంట్స్ (జియో ఫిజిక్స్) పోస్టులకు నవంబర్ 25, 27న, టెక్నికల్ అసిస్టెంట్స్ (హైడ్రా జియాలజీ) పోస్టులకు నవంబర్ 26, 27న , టెక్నికల్ అసిస్టెంట్స్ (మైనింగ్, జియాలజీ) పోస్టులకు నవంబర్ 27న, టెక్నికల్ అసిస్టెంట్ (పురావస్తు) పోస్టులకు నవంబర్ 26, 27 తేదీల్లో, సంక్షేమ నిర్వాహకులు (సైనిక సంక్షేమ, ఉప సేవలు) పోస్టులకు నవంబర్ 27న పరీక్షలు జరుగనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: