బ్యాంకింగ్ రంగంలో కొలువుల
కోసం ఎప్పటి నుంచో సాధన చేస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకి ఐబీపీఎస్ (
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ) గుడ్ న్యూస్ చెప్పింది. 2019 కి
గాను 4336 పీవో ఉద్యోగాలకి భారీ
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రోబిషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్తులని
భర్తీ చేయనుంది. ఉద్యోగ వివరాలలోకి వెళ్తే..
బ్యాంకుల వారీగా ఖాళీలు..
1 అలహాబాద్ బ్యాంక్ – 500
2 బ్యాంక్ ఆఫ్ ఇండియా - 899
3 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రా - 350
4 కెనరా బ్యాంక్ - 500
5 కార్పోరేషన్ బ్యాంక్ - 150
6 ఇండియన్ బ్యాంక్ - 493
7 ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ - 300
8 యూకో బ్యాంక్ - 500
9 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 644
అర్హతలు – గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుంచీ లేదా యూనివర్సిటీ నుంచీ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు - ఆగస్టు -1 2019 నాటికి 20- 30 ఏళ్ళ మధ్య ఉండాలి.
ఎస్సీ ఎస్టీ ,ఎక్స్ సర్వీస్ మెన్స్ అభ్యర్దులకి అయిదేళ్ళు ,
ఓబీసీ లకు మూడేళ్ళు ,
పీహెచ్ సీ లకు పదేళ్ళు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం - ప్రిలిమినరీ, మెయిన్స్ , పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా
ధరఖాస్తు విధానం - ఆన్లైన్ లో
ధరఖాస్తు ప్రారంభ తేదీ - ఆగస్టు 7 , 2019
ధరఖాస్తు చివరి తేదీ – ఆగస్టు 28 , 2019
ప్రిలిమినరీ పరీక్ష తేదీ – అక్టోబర్ -2019 ( 12,13,19,20 తేదీలలో)
మెయిన్స్ పరీక్ష తేదీ - నవంబర్ 30 , 2019