బ్యాంకింగ్ రంగంలో కొలువుల కోసం ఎప్పటి నుంచో సాధన చేస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకి ఐబీపీఎస్ ( ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ) గుడ్ న్యూస్ చెప్పింది. 2019 కి గాను 4336 పీవో ఉద్యోగాలకి  భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రోబిషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్తులని భర్తీ చేయనుంది. ఉద్యోగ వివరాలలోకి వెళ్తే..

 Image result for ibps

బ్యాంకుల వారీగా ఖాళీలు..

1 అలహాబాద్ బ్యాంక్ – 500

2 బ్యాంక్ ఆఫ్ ఇండియా  - 899

3 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రా  - 350

4 కెనరా బ్యాంక్    - 500

5  కార్పోరేషన్ బ్యాంక్  - 150

6  ఇండియన్ బ్యాంక్  - 493

7 ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్  - 300

8 యూకో బ్యాంక్  - 500

9 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  - 644


అర్హతలు – గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుంచీ లేదా యూనివర్సిటీ నుంచీ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు -  ఆగస్టు -1 2019 నాటికి 20- 30 ఏళ్ళ మధ్య ఉండాలి.

                 ఎస్సీ ఎస్టీ ,ఎక్స్ సర్వీస్ మెన్స్ అభ్యర్దులకి అయిదేళ్ళు ,

                 ఓబీసీ లకు మూడేళ్ళు  ,

                 పీహెచ్ సీ లకు పదేళ్ళు   వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం  - ప్రిలిమినరీ, మెయిన్స్ , పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా

ధరఖాస్తు విధానం  - ఆన్లైన్ లో

ధరఖాస్తు ప్రారంభ తేదీ  - ఆగస్టు 7 , 2019

ధరఖాస్తు చివరి తేదీ –  ఆగస్టు 28 , 2019

ప్రిలిమినరీ పరీక్ష తేదీ – అక్టోబర్ -2019 ( 12,13,19,20 తేదీలలో)

మెయిన్స్ పరీక్ష తేదీ  - నవంబర్ 30 , 2019


మరింత సమాచారం తెలుసుకోండి: