శరవేగంగా విస్తరిస్తున్న ఆతిథంమ‌ రంగం ఇది.. వేలాది అవకాశాలకు కేంద్రంగా మారుతోంది. పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో, అదే స్థాయిలో హాస్పిటాలిటీ రంగంలో మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. దాంతో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య అధికమవుతోంది.


ప్రవేశం:
హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు లను బట్టి అర్హతలు ఉంటాయి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు పదో తరగతి, బ్యాచిలర్ కోర్సులకు ఇంటర్మీడియెట్ పూర్తి చేసినవారు అర్హులు. మన రాష్ట్రంలో సెట్విన్‌.. హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా (వ్యవధి: మూడేళ్లు). పీజీ డిప్లమా (వ్యవధి: ఏడాది), హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజంలో పీజీ డిప్లమా (వ్య‌వ‌ధి: ఏడాది) అందిస్తోంది.


అవకాశాలు:
హోటల్ మేనేజ్‌మెంట్ ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ (ఎఫ్ అండ్ బి), ఫ్రంట్ ఆఫీస్ హౌస్ కీపింగ్, వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్లో స్థిరపడొచ్చు. ఈ క్రమంలో హోటల్/ హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలు మేనేజ్‌మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్‌మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ స్కిల్స్ సేల్స్, గెస్ట్‌/క‌స్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్ లో మేనేజ్మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్ జాబ్ పొందొచ్చు.


వేతనాలు:
కెరీర్ ప్రారంభంలోనే ఐదంకెల జీతాన్ని సొంతం చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీగా అయితే రూ. 20 నుంచి రూ. 23,000, ట్రైనీ  సూపర్‌వైజర్ అయితే రూ.15 నుంచి 20 వేలు, మిగతా విభాగాల వారికి రూ 15,000 వరకు వేతనం లభిస్తుంది.


స్కిల్స్‌:
మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌
మేనేజీరియ‌ల్ నైపుణ్యాలు
సేల్స్ అండ్ మార్కెటింగ్‌కు స్కిల్స్‌


వైబ్‌సైట్‌: www.nimsme.org


మరింత సమాచారం తెలుసుకోండి: