భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ అయిన సైనిక స్కూల్ సొసైటీ దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 31 సైనిక స్కూల్స్ లలో 2020-2021 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం కేవలం బాలుర నుంచీ ధరఖాస్తులని కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సైనిక స్కూల్స్ ద్వారా పిల్లల్లో దేశభక్తి పెంపొందించడమే కాకుండా, వారిని ధైర్య సాహసాలలో ముందు ఉంచడంలోనూ, అదేవిధంగా దేశరక్షణలో భాగంగా ఉన్న అనేక రక్షణ మంత్రిత్వ శాఖలలో చేరటానికి బాల్యం నుంచీ తర్ఫీదు ఇవ్వడంలో ఎంతగానో ఉపయోగపడుతాయి.

 Adminissions

ఈ నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

6,9, తరగతులలో 2020-2021  ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

వయసు: అలాగే 6 తరగతి విద్యార్ధులు -31 మార్చి నాటికి 10 -12 ఏళ్ళు , అలాగే 9 తరగతి విద్యార్ధులు 13 -15 ఏళ్ళ మధ్య వయసు వాళ్ళు అయ్యి ఉండాలి.

 

ఎంపిక విధానం - ఏఐఎస్‌ఎస్‌ఈఈ 2020 ప్రవేశ పరీక్ష, మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.


పరీక్ష తేదీ – 05-01-2020
ధరఖాస్తు విధానం  - ఆన్లైన్ విధానం
ధరఖాస్తు ప్రారంభ తేదీ – 5-8-2019
ధరఖాస్తు చివరి తేదీ   – 23-9-2019

మరిన్ని వివరాలకు వెబ్సైటు -  https://www.sainikschooladmission.in/index.html


మరింత సమాచారం తెలుసుకోండి: