జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలకమైన ఉద్యోగాల కోసం రాత పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 1 నుంచి 8 వరకు జరగనున్న ఈ పరీక్షలకు 20 లక్షల వరకూ హాజరవుతారని అధికారులు అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.


అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని ముందుగానే సూచిస్తున్నారు. ఆ లోపు కేంద్రాలకు చేరని వారిని అనుమతించేదని లేదని జిల్లా కలెక్టర్లు స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థులు వేరు వేరు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో ఉదయం రాసిన కేంద్రంలోనే మధ్యాహ్నం కూడా పరీక్ష రాసేలా చర్యలు చేపడుతున్నారు.


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పలు జిల్లాలకు కు చెందిన కలెక్టర్లు చెబుతున్నారు. జిల్లా ఎంపిక కమిటీ గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులను ఎంపిక చేస్తుంది. పలు జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే పరీక్షల నిర్వహణపై సమీక్షలు నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: