గణపతి నవరాత్రుల లో మట్టి గణపతిని ప్రతిష్టించాలని, ఇంట్లో మట్టి  గణపతి పూజించాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విజ్ఞప్తి చేసారు. వాసవి యువజన సేవ సంఘం ఆద్వర్యం లో గత పది ఏళ్లగా మట్టిగణపతుల ప్రచారం, పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఆదివారం  మట్టిగణపతుల పంపిణి ప్రారంభించారు. మొదటి మట్టి గణపతి విగ్రహాన్ని కేంద్ర మాజీ మంత్రి  బండారు దత్తాత్రేయకి సామాజిక వేత్త పుట్టా రామకృష్ణ సంస్థ  ప్రతినిధులతో కలిసి అందజేశారు. గణపతి నవరాత్రులు చాలా నిష్టగా నిర్వహించాలని, యువత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని..మట్టి గణపతులు పంపిణి అభినందనీయమని పేర్కొన్నారు. వినాయక సహస్ర నామాలలో వెయ్యి రకాలు చెప్పబడాయి . అలాంటి వినాయక  ప్రతిమలు ఎంతో  భక్తి పారవశ్యాన్ని  కలుగజేస్తాయి. వినాయకుడు చాలా శక్తీ గల శక్తీ కలిగిన దేవుడు. మనం ఎలా పూజిస్తామో అలానే కరుణిస్తాడని సామాజిక వేత్త పుట్టా రామకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో  ఎవరి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా విగ్రహాలు తయారుచేయించుకుని   పూజిస్తున్నారు. ఇది పూర్తిగా శాస్త్ర విరుద్ధం. ప్రతీ వినాయక చవితికి  ఇదే తంతు జరుగుతుంది , వినాయకుణ్ణి మనం మండపాలల్లో ఎందుకు ప్రతిష్టిస్తున్నాము?,  అందులో అంతరార్థం ఏంటి? వంటి అంశాలపై  చాలా మంది తప్పుదోవ పడుతున్నారు.





ప్లాస్టర్ అఫ్ పారిస్ తో రూపొందించే గణపతులలో సరదాగానో, తెలియజానో,  వేరే వారు ప్రోత్సహిస్తేనో మనం వివిధ ఆకారాలలో    ఫిదా  గణపతి,  గబ్బర్ సింగ్ 2 గణపతి, బాహుబలి 2 గణపతి, స్పైడర్ మాన్  గణపతి    బుల్లెట్ గణపతి ...ఇలా  చిత్ర  విచిత్ర  పద్ధతుల్లో  తయారు చేస్తున్నారు.  బుద్ధి రాను రాను వక్రీకరించడం   వల్లనే దేశంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. నవరాత్రులలో నిత్యం రెండు పూతల పూజలు, భజనలు చాల అవసరం. వినాయకుని  కి  21  పత్రి తో పూజ చెయ్యవచ్చు. అవకాశం ఉంటే నవరాత్రులు మండపంలో ఉన్న యువత గణపతి  మాల ధరుంచి మండపానికి ఆధ్యాత్మిక శోభను తెచ్చి కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వాతావరణం లో ఉంచాలి. అన్నదానం చాల ముఖ్యం, ఎంత పెద్ద  గణపతిని ప్రతిష్ఠిస్తే అంతే స్థాయిలో అన్నదానం  నిర్వహించాలి. ముఖ్యంగా  ఈ విషయంలో యువత తప్పు దారి పడుతుంది.  ఇక నవరాత్రులు చివరి రోజు  చాలా హంగామా చేస్తారు. తాగడం , ఎగరడం - దూకడం లాంటి కృత్యాలు చేసి మన హిందూ సంస్కృతీ పరువు మనమే తీస్తున్నాము.  వీలైతే భజనలు చేయండి లేదా  భగవద్గిత  వేయండి, లేదంటే ఏమీ చేయకుండనైనా ఉండడం ఉత్తమమైన పని అన్నారు.. 




ఒక మండపం నుండి ఒక్కో  మండపం పెరిగితే మనలో ఐక్యమత్యం తగ్గుతున్నట్లు , 100 మండపాల నుండి ఒక్కొక్క మండపం తగ్గుతూ  ఒక కాలనిలో ఒకే మండపం అయితే ఐక్యమత్యo పెరిగినట్లు. రోడ్ పై మండపాలు వేసేవారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాహనాలు వచ్చి పోయే దారి విడిచిపెడితే శ్రేయస్కరం. మనం చేసే ఉత్సవం ప్రజలు మెచ్చలి. దీన్ని సరిదిద్దడం ఒక్కరితోనే మొదలవ్వాలి. ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు. ధర్మాన్ని కాపాడి దేశ భవిష్యత్తుకు పునాది వేయండి.  సంస్కతిని కాపాడే బాధ్యత మననుండే మొదలవ్వాలి. గత పదేళ్లుగా తెలుగు రాష్ట్రాలలో సామాజిక మాధ్యమాల్లో ఇకో ఫ్రెండ్లీ గణపతులు గురించి ప్రచారం  నిర్వహిస్తూ పలు ప్రాంతాల్లో  ఉచితంగా మట్టి గణపతులను పంపిణీచేయడం జరుగుతుందని, హైదరాబాద్ నగరం లో వివిధ ప్రాంతాల్లో పంపిణి చేస్తూ  ప్రజలకు అవగాహణ కల్పించనున్నామన్నారు. కార్యక్రమం లో సంస్థ ప్రతినిధులు సూరి అప్పారావు, చందు, సూర్య, కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: