ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి పీజీ వరకు చదివే బ్రాహ్మణ విద్యార్థులకు  నగదు ప్రోత్సాహకాలను అందచేయనున్నది. ఇందుకు  ఆగస్టు 15 వ తేదీ  నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. 2019–20 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.




ఏ పధకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రొత్సాకాలను ఒకసారి పరిశీలిద్దాం.. 1 వ తరగతి  నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు  ఇచ్చే ప్రోత్సాహకం మొత్తం రూ.5 వేలు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.7 వేలు, ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, డీఎడ్, డీఫార్మసీ తదితర కోర్సులకు రూ.10 వేలు, డిగ్రీ కోర్సులకు రూ.15 వేలు, వృత్తి విద్యా కోర్సులకు రూ.20 వేలు, పీజీ కోర్సులకు రూ.10 వేలు ఒకే దఫాగా ఎంపిక చేసిన విద్యార్థులకు పొదుపు ఖాతాలో జమ చేస్తారు.




అర్హులైన విద్యార్థులు వారి దరఖాస్తులను ఆన్ లైన్ లో దాఖలు చేసుకోవాలి.  డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆంధ్రాబ్రాహ్మిణ్‌.ఏపీ.జీఓవీ.ఐఎన్‌ అనే వెబ్‌సైట్‌లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు 15 ఆగస్టు 2019 నుంచి 30 సెప్టెంబర్‌ 2019 వరకు, ఇతర కోర్సులు చదివే విద్యార్థులు సెప్టెంబరు 1వ తేదీ నుంచి అక్టోబర్‌ 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు 
సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: