సైనిక్ స్కూళ్లు.. ఇవి క్రమశిక్షణకు మారుపేరు.. ఓ విద్యార్థి కేవలం పుస్తకాల పురుగులా కాకుండా.. మార్కుల యంత్రంలా కాకుండా అన్నివిధాలుగా అభివృద్ధి చెందేందుకు చాలా ఉపయోగపడే స్కూళ్లు ఇవి. ప్రత్యేకించి ఇక్కడ సైనికుల తరహాలో ఇచ్చే శిక్షణ.. విద్యార్థిని ఓ మంచి పౌరునిగా తయారు చేస్తుంది.


అందుకే వీటికి చాలా డిమాండ్ ఉంది. ఈ సైనిక స్కూల్స్ ఎంట్రన్స్-2020 ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్న 31 సైనిక స్కూల్స్ లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో కేవలం బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. 6,9 తరగతులలో ప్రవేశాలు కల్పిస్తారు.


6వ తరగతి లో చేరగోరు వారు మార్చి 31 నాటికి 10--12 ఇయర్స్ మధ్య వయస్సు ఉండాలి.. 9వ తరగతి లో చేరగోరు వారు 13--15 ఇయర్స్ మధ్య వయస్సు ఉండాలి. దరఖాస్తు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి. దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ 23.9.19.. ఎంట్రన్స్ 05.01.2020న ఉంటుంది.


ఈ పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలు www.sainikschooladmission.in వెబ్ సైట్లో తెలుసుకోవచ్చు.. ఆంధ్రప్రదేశ్‌ లోసైనిక్ స్కూళ్లు విజయనగరం జిల్లాలోని కోరుకొండలోనూ.. చిత్తూరు జిల్లా కలికిరిలోనూ ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: