Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 2:33 am IST

Menu &Sections

Search

ఆర్మీ రిక్రూట్ మెంటు ర్యాలీ నోటిఫికేషన్ విడుదల

ఆర్మీ రిక్రూట్ మెంటు ర్యాలీ నోటిఫికేషన్ విడుదల
ఆర్మీ రిక్రూట్ మెంటు ర్యాలీ నోటిఫికేషన్ విడుదల
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆర్మీ రిక్రూట్ మెంటు ర్యాలీ నోటిఫికేషన్ ను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్   విడుదల చేశారు. కలెక్టర్ కార్యాలంయలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడారు. ఆర్మీ రిక్రూట్ మెంటు ర్యాలీని శ్రీకాకుళంతో సహా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, విశాఖపట్నం, విజయనగరం, పాండిచ్ఛేరీ రాష్ట్రంలోని యానాం జిల్లాల అభ్యర్ధులకు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ ఆర్మీ రిక్రూట్ మెంటుకు 50 వేల మంది అభ్యర్ధులు పాల్గొంటారని అంచనా వేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  నోటిఫికేషన్ లోని వివరాలు పూర్తిగా అవగాహన చేసుకోవాలని తద్వారా వ్రాత, భౌతిక పరీక్షలలో సులభంగా విజయం సాధించగలరని చెప్పారు. ఈ మీడియా ప్రనిధుల సమావేశంలో ఆర్మీ రిక్రూట్ మెంటు డైరక్టర్ కల్నల్ భూపేందర్ సింగ్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి తదితరులు పాల్గొన్నారు.  వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా నుండి ఆర్మీలో ఎక్కువ మంది పనిచేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.



శ్రీకాకుళంలో వచ్చే నవంబరు 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్ మెంటు ర్యాలీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఆర్మీ రిక్రూట్ మెంటు ర్యాలీపై మంగళ వారంవివరాలు వెల్లడించారు.  సోల్జర్  (సైనికుడు), (జనరల్ డ్యూటీ), సోల్జర్ (ట్రేడ్స్ మెన్), సోల్జర్ (టెక్నికల్), సోల్జర్ (నర్సింగు అసిస్టెంట్, వెటర్నరీ నర్సింగు అసిస్టెంటు), సోల్జర్ (క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్) పోస్టులను భర్తీ చేస్తారని చెప్పారు. సెప్టెంబరు 8వ తేదీన ప్రకటనను విడుదల చేసారని కలెక్టర్ పేర్కొన్నారు. www.joinindianarmy.nic.in వెబ్ సైట్ లో వివరాలకు సంప్రదించవచ్చని చెప్పారు. అభ్యర్ధులు సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22వ తేదీ వరకు వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అడ్మిట్ కార్డులను అక్టోబరు 23 నుండి వెబ్ సైట్ నుండి పొందవచ్చని చెప్పారు. ఆర్మీ రిక్రూట్ మెంటు ర్యాలీ శ్రీకాకుళంలో ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)లో జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.





నియామకం పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, మద్యదళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని, పుకార్లను నమ్మరాదని ఆయన అన్నారు. అభ్యర్ధులు కష్టపడి చదవడం, శారీరక ధారుడ్యం ఆధారంగా ఎంపిక జరుగుతుందని గ్రహించాలని అన్నారు. అభ్యర్ధులు ఆన్ లైన్ మొబైల్ యాప్ఆర్/మై  Army calling మరియు విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్ మెంటు కేంద్రం ఫోన్ నంబరు 0891 2754680 ఫోన్ చేసి నియామకానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్ధుల సౌకర్యార్ధం మొబైల్ యాప్ లో తెలుగులో లైవ్ చాట్ సౌకర్యం ఉందని అన్నారు. అభ్యర్దులు గూగుల్ ప్లే స్టోర్ నుండి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్ధులు సకాలంలో దరఖాస్తు చేయాలని జిల్లా కలెక్టర్ నివాస్ అభ్యర్ధులను కోరారు. ఆర్మీలో చేరడం గొప్ప అవకాశమని ఆయన అన్నారు. మంచి భవితకు పునాది అని అన్నారు. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో దరఖాస్తు చేయాలని కోరారు.


Army recruit releases rally notification
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మానవ రహిత పారిశుద్యం స్ఫూర్తిదాయకం..
రేప్,అట్రాసిటీ కేసుల్లో ఏపీదే అగ్రస్థానం..
మానవ వనరులే మన పెట్టుబడి...
ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నారు..?
సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు..
సుజాతారావు కమిటీ సిఫార్సులకు ఆమోద ముద్ర..
థీమ్ పార్కును సందర్శించిన చెన్నైజలమండలి అధికారులు
విద్యార్థుల్లో స్వచ్ఛ స్ఫూర్తికి కృషి..?
కొత్త చట్టానికి రాష్ట్రాల స్పీడ్ బ్రేకర్..
ఆయన శవ రాజకీయాలకు కేరాఫ్..
కోడెల మరణం ఓ గుణపాఠం కావాలి...!
సహాయ చర్యల్లో చురుకుగా నేవీ సిబ్బంది..
శంఖనిధి, పద్మనిధి అంటే ఎవరో తెలుసా..?
కోడెల మరణంపై కేంద్రంతో దర్యాప్తు.. దేనికి సంకేతం
ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కోడెల కుటుంబం..అందుకేనా ?
‘రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో’ నియామకం
శక్తివంతమైన మరో క్షిపణి
వీటిని పాటిస్తే ఇక ఫీవర్స్ ఉష్ కాకి ..
రాయలసీమ ప్రాజెక్టులన్నింటికీ జలకళ
సొంత ఆటో టాక్సీ క్యాబ్ డ్రైవర్లకు చేయూత..
తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా..
ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లస్థలాలు..
ఎలక్ట్రానిక్‌ హబ్‌గా ఏపీ..
చంద్రబాబు తీరును అనుమానిస్తున్న నెటిజనులు..
చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు?
నిజాం రాచరికం పునాదులను కదిలించిన రోజిది...
చరిత్రలో ఈ రోజు..
విద్యార్థులకు సీజనల్ వ్యాధుల నివారణపై క్లాసులు
రూ. కోటికి చేరిన స్వ‌చ్ఛ ఉల్లంఘ‌న‌ల‌ జ‌రిమానాలు
టీడీపీ నేతల విజ్ఞతకే వారి విమర్శలు..
కోడెల ఉరేసుకున్నాడంట..
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు కోడెల పార్థివ దేహాం..
మోక్షగుండం సేవలు చిరస్మరణీయం
గుండెపోటుతో కోడెల కన్నుమూత..
ముపైఏళ్ళల్లో వంద మందికి పైగా మృత్యువాత
పాకిస్థాన్ విభజనను ఏ శక్తీ ఆపలేదు.
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.