Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 1:03 pm IST

Menu &Sections

Search

విద్యార్థులకు సీజనల్ వ్యాధుల నివారణపై క్లాసులు

విద్యార్థులకు సీజనల్ వ్యాధుల నివారణపై క్లాసులు
విద్యార్థులకు సీజనల్ వ్యాధుల నివారణపై క్లాసులు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాలపై పాఠ‌శాల విద్యార్థుల‌ను చైత‌న్య‌ప‌రిస్తే వారు త‌మ త‌ల్లిదండ్రుల‌ను, ఇరుగు, పొరుగు వారిని కూడా చైత‌న్య‌ప‌రుస్తార‌ని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఇందుకుగాను హైదరాబాద్‌లో చేపట్టిన సీజనల్ వ్యాధుల నివారణ, దోమల నివారణకు చేపట్టిన కార్య‌క్ర‌మాల్లో పాఠ‌శాల‌ల విద్యార్థినీ, విద్యార్థుల‌ను భాగ‌స్వామ్యం చేసేందుకు జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ప్ర‌తిరోజు ప్రార్థ‌న‌లో బ‌ల్దియా మెడిక‌ల్ అధికారులు, ఎంట‌మాల‌జీ అధికారులు దోమలు, లార్వా నివారణ కార్య‌క్ర‌మాల‌పై అవ‌గాహ‌న కల్పిస్తున్నారు. ముఖ్యంగా ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, దోమ‌ల నివార‌ణ త‌దిత‌ర అంశాల‌పై చైత‌న్య ప‌రుస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి పాఠశాలలో గ‌త కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ మెడిక‌ల్ అధికారులు, డిప్యూటి క‌మిష‌న‌ర్లు, శానిట‌రీ సూప‌ర్ వైజ‌ర్లు, ఎస్‌.ఎఫ్‌.ఏలు స్వ‌యంగా వెళ్లి త‌ర‌గ‌తుల వారిగా సీజనల్ వ్యాధులపై చైతన్య పరుస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 7,600 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా వీటిలో పది లక్షల మంది విద్యార్థినీవిద్యార్థులు ఉన్నారు. ప్రతి పాఠశాలకు జిహెచ్ఎంసి అధికారులు వెళ్లి దోమల ఉత్పత్తికి దోహదపడే ప్రాంతాలు, ఇళ్లలో పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు, డ్రమ్ లు, పాత టైర్లు, డిస్పోసబుల్ గ్లాసులు, ఇంటి కప్పుపై వారాలతరబడి ఉండే నీటి నిల్వల వల్ల డెంగ్యూ కారక ఏడిస్ టైగర్ దోమ స్థావరం ఏర్పాటు చేసుకొని గుడ్లు, ప్యూపా, లార్వా దశలుగా రూపాంతరం చెంది మూడు రోజుల్లో పెద్ద దోమగా బయటకు వస్తుందని విద్యార్థులను చైతన్యపరుస్తున్నారు. ఈ దోమ వ్యాప్తి చెందకుండా ప్రతి ఇంటిలో నీటి నిల్వలను తొలగించాలని, తమ తల్లిదండ్రులకు, పరిసరాల వారికి తెలియజేయాలని పాఠశాలల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వ‌ర్షాకాల సీజన్ లో హైదరాబాద్ నగరంలో అంటువ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా జీహెచ్ఎంసీ ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించి అమ‌లు చేస్తోంది. ముఖ్యంగా దోమ‌ల వ్యాప్తిని అరిక‌ట్ట‌డం ద్వారా అంటువ్యాధుల నివార‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టింది. నగరంలోని ప్రధాన రెఫరల్ ఆసుపత్రులైన ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ లలో 25మంది చొప్పున అదనపు డాక్టర్లతో అదనపు ఓపి కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రులతో పాటు నగరంలో ఉన్న95 అర్బన్ హెల్త్ సెంటర్లలో ఈవీనింగ్ క్లీనిక్ లను నిర్వహిస్తున్నారు.105 బస్తీ దవాఖానలలోనూ పూర్తిస్థాయి మందులు, సిబ్బందితో డెంగ్యు, సీజనల్ వ్యాధులపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. బస్తీ దవాఖానల్లో 200 రకాల వైద్య పరీక్షలు, 150 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేపట్టారు.  ప్రతి ఆసుపత్రిలోనూ కేవలం 60నిమిషాలలోపే ఔట్ పేషంట్ లకు పరీక్షలు నిర్వహించే విధంగా అదనపు కౌంటర్లను, డాక్టర్లను నియమించారు. ఇప్పటి వరకు 500లకు పైగా ఉచిత వైద్య శిబిరాలను నగరంలోని హై రిస్క్ ప్రాంతాల్లో నిర్వహించారు.  జీహెచ్ఎంసీ ఎంట‌మాల‌జి విభాగంలో ఉన్న2,375 సిబ్బంది నిరంత‌రం లార్వా నివార‌ణ కార్య‌క్ర‌మాలను చేప‌ట్ట‌డంతో పాటు నీటి నిల్వ‌లు, అప‌రిశుభ్ర ప‌రిస‌రాల వ‌ల్ల దోమ‌ల వ్యాప్తి ఏవిధంగా జ‌రుగుతుందో తెలియ‌జేసే చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.  ప్ర‌తిరోజు650 ఎంటమాలజి బృందాలు దోమ‌ల వ్యాప్తికి కార‌క‌మైన లార్వా ఉత్ప‌త్తి కేంద్రాల‌ గుర్తింపుకు ల‌క్షా 40వేల గృహాల‌లో ఇంటింటి త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నాయి. వీటిలో దోమ‌ల ఉత్ప‌త్తికి అనువైన ప్రాంతాలను గుర్తించి ఈ గుర్తించిన గృహాల్లో లార్వా నివార‌ణ మందు స్ప్రేయింగ్ చేయ‌డం ఇత‌ర చ‌ర్య‌ల‌ను చేప‌డుతున్నారు.
ఓవ‌ర్‌హెడ్ ట్యాంక్‌లు, సంపులు, న‌ల్లా గుంత‌లతో పాటు డ్ర‌మ్‌లు, డ‌బ్బాలు, కుండ‌లు, టైర్ల‌లో నీటి నిల్వ‌ల‌ను తొల‌గిస్తున్నారు. 150 పోర్ట‌బుల్‌, 10 ఫాంగింగ్ మిష‌న్లు క‌లిగిన వాహ‌నాల ద్వారా ప్ర‌తిరోజు 150 కాల‌నీల‌లో ఫాగింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఈ ఫాగింగ్‌ను నిర్వ‌హించే ప్ర‌తి కాల‌నీ, బ‌స్తీలోని నివాసితులు, స్థానిక నాయ‌కులు, కాల‌నీ సంక్షేమ సంఘాలు, కార్పొరేట‌ర్ల నుండి ధృవీకరణ సంత‌కాల‌ను కూడా సేక‌రిస్తున్నారు. గ‌తంలో డెంగ్యు, మ‌లేరియా కేసులు న‌మోదైన బ‌స్తీల్లో ముంద‌స్తుగా పెరిత్రియం స్ప్రేను చ‌ల్లుతున్నారు.  గ‌తంలో న‌మోదైన డెంగ్యు, మ‌లేరియా కేసుల ప్రాంతాల‌ను జీయో ట్యాగింగ్ ద్వారా అనుసంధానించ‌డంతో పాటు నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. డెంగ్యు ఫాజిటీవ్ కేసులు వచ్చిన ఇళ్లను గుర్తించి ఆ ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల 50 మీటర్ల వరకు విస్తృతంగా దోమల నివారణ మందును స్ర్పే చేయడం, ఫాగింగ్ చేపట్టారు.  దోమ‌ల వ్యాప్తి వ‌ల్ల క‌లిగే అన‌ర్థాల‌పై న‌గ‌రంలోని 1800లకు పైగా ఉన్న పాఠ‌శాలల విద్యార్థుల‌కు చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. టౌన్‌లేవ‌ల్ ఫెడ‌రేష‌న్లు, స్ల‌మ్‌లేవ‌ల్ ఫెడ‌రేష‌న్లు, మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క బృందాలు, కాల‌నీ సంక్షేమ సంఘాల‌ను ఈ చైత‌న్య కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో భాగ‌స్వామ్యం చేస్తున్నారు. 
అత్తాపూర్ నుండి చాద‌ర్‌ఘాట్ వ‌ర‌కు గ‌ల మూసి ఇరువైపులా126మంది స‌భ్యులు గ‌ల42 లార్వా నిరోధ‌క బృందాల‌చే దోమ‌ల ఉత్ప‌త్తి నివార‌ణకు స్ప్రేయింగ్‌, వ్య‌ర్థాల తొల‌గింపును చేపడుతున్నారు.చెరువుల్లో దోమ‌లను ఉత్ప‌త్తిచేసే గుర్ర‌పుడెక్క ఆకును నిరంత‌రం తొల‌గిస్తున్నారు.  చెరువుల్లో దోమల నివారణకు డ్రోన్ ల ద్వారా మందును స్ర్పే చేస్తున్నారు. గ‌తంలో మ‌లేరియా, డెంగ్యు, చికెన్‌గున్య వ‌చ్చిన ప్రాంతాల‌ను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి వాటిని జీఐఎస్ మ్యాపింగ్ చేసి వాటిపై తిరిగి అంటువ్యాధుల నిరోధానికి ప్ర‌త్యేక దృష్టిని సాధించ‌డం జ‌రుగుతుంది. 4,500 స్వయం సహాయక బృందాలలోని నాలుగున్నర లక్షల మంది మహిళలను డెంగ్యు, ఇతర అంటు వ్యాధుల నివారణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. జిహెచ్ఎంసి వద్ద ఉన్న 10.50 లక్షల మంది ఇంటి పన్ను చెల్లింపుదారుల మొబైల్ ఫోన్లకు డెంగ్యు నివారణ చర్యలపై అవగాహన సందేశాలను పంపించడం జరిగింది. టౌన్‌లేవ‌ల్, స్ల‌మ్‌లేవ‌ల్‌ ఫెడ‌రేష‌న్లు, కాల‌నీ సంక్షేమ సంఘాలతో అంటు వ్యాధుల నివార‌ణ‌కై చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింది. మై జీహెచ్ఎంసి యాప్‌, డ‌య‌ల్100, జీహెచ్ఎంసి కాల్ సెంట‌ర్‌, ఇ-మెయిల్‌, వాట్స‌ప్ త‌దిత‌ర మాద్య‌మాల ద్వారా  దోమ‌ల బెడ‌ద‌, అంటువ్యాధుల పై అందే ఫిర్యాదుల ప‌ట్ల వెంట‌నే స్పందించి త‌గు చ‌ర్య‌లను చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది. 

 ప్ర‌చార సాధ‌నాలైన ఎల‌క్ట్రానిక్ మీడియా, ప‌త్రిక‌లు, రేడియోల ద్వారా విస్తృత ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది. ప్ర‌స్తుత వ‌ర్ష‌కాల సీజ‌న్‌లో డెంగ్యు, మ‌లేరియా త‌దిత‌ర అంటువ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా ఉండేందుకుగాను ప్ర‌తి శుక్ర‌వారం రోజును డ్రై డేగా పాటిస్తూ ఖాళీ కుండ‌లతో పాటు నీరు నిల్వ ఉండే ప్లాస్టిక్ డ్ర‌మ్‌లు, డ‌బ్బాలు, న‌ల్లా గుంత‌లు, పాత టైర్లలో నీటిని తొల‌గించే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్యేకంగా చేప‌డుతున్నారు. న‌ల్లా గుంత‌లు, ఓవ‌ర్‌హెడ్ ట్యాంక్‌లు, ప్లాస్టిక్ డ్ర‌మ్‌లు, సిమెంట్ ట్యాంక్‌లు త‌దిత‌ర నీటిని నిల్వ ఉండేవాటిపై త‌ప్ప‌నిస‌రిగా మూత‌లు ఉండేవిధంగా చ‌ర్య‌లు చేప‌ట్టారు. పాఠ‌శాల‌లు, కార్యాల‌యాలు, ఫ్యాక్ట‌రీలు, గోడౌన్‌లు, వ్యాపార, వాణిజ్య సంస్థ‌లు కూడా ప్ర‌తి శుక్ర‌వారం డ్రై డేగా పాటించాల‌ని అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించేందుకు చేపట్టాల్సిన చర్యలపై దాదాపు 8 లక్షలకు పైగా కరపత్రాలను నగరంలోని బస్తీలు, మురికివాడల నివాసితులకు పంపిణీ చేయడం జరిగింది. డెంగ్యు వ్యాధి, నివారణ చర్యలను సూచిస్తూ ఐదు లక్షల కరపత్రాలను ప్రత్యేకంగా ముద్రించి ఎంటమాలజి విభాగం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. డెంగ్యు వ్యాధి, వాటి నివారణపై చైతన్యపర్చేందుకు నగరంలో 50 ప్రధాన ప్రాంతాల్లో హోర్డింగ్ లను ఏర్పాటు చేస్తున్నారు.


Baldia encourages students on the prevention of seasonal diseases
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎపిలో నేటి నుంచి వైఎస్ఆర్ నవోదయం పధకం..
గెలుపు అనివార్యమంటున్న గులాబీదళం... కేసీఆర్ సభకు సన్నర్ధం
ససేమిరా అంటున్న కేసీఆర్.. పట్టుబిగిస్తున్న ఆర్టీసీ జేఏసీ
గ్రీన్ లంగ్‌స్పేస్‌ల ఏర్పాటుకు చర్యలు..
విరుద్ధంగా కేటాయింపులు.. అందుకే రద్దు చేశాం..
మొత్తానికి బోటు ఆచూకీ దొరికిందా..
మత్స్యకారులకు రూ.100కోట్లతో డీజిల్‌ బంకుల ఏర్పాటు
వ్యవస్థను నాశనం పట్టించారు...టిఎఏ మద్దతు కోరిన ఆర్టీసీ జేఏసీ
ఉద్యమరూపం దాల్చిన ఆర్టీసీ సమ్మె.సామూహిక దీక్షల్లో సిపిఐ ..
భర్తను గోతునులిమి చంపిన భార్య..
మరిన్ని సంక్షేమ పథకాలు అమలే అజెండాగా. మంత్రివర్గం భేటీ
ఆయన అడుగు పెడితే ప్రకృతి కూడా పులకరిస్తుంది.
48 గంటల పాటు మంచినీటి స‌ర‌ఫ‌రా బంద్
ఆ చర్చలకు..15 సంవత్సరాలు..
ఇది నిజమేనా..ఆయన దరిద్రం వల్లే ఇన్నాళ్లు నిండలేదా
ప్రభుత్వ ఉద్దేశం తెలిస్తే సమస్య పరిష్కారమయ్యేది.
లోయలోపడిన పర్యాటకుల బస్సు..పది మంది దుర్మరణం..
ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుందే
ఆద్యంతం వీనుల విందుగా సిరిమానోత్సవం..
తప్పని సరి పరిస్థితుల్లో పొత్తు వెనక్కి..
వై ఎస్ పాలన తిరిగి మొదలైందిగా..
వాళ్ళ తాటాకు చప్పుళ్లకు భయపడను..
జగనన్న ముద్ర ఉండేలా.. విద్య మంత్రి పాఠాలు
ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే వస్తాం..
ఆర్టీసీ ప్రభుత్వ విలీనంతోనే వారికీ ఆత్మకు శాంతి
45 ఏళ్ల కుర్రోడి దెబ్బకు ఆయన మైండ్‌ బ్లాక్‌..
తెల్ల కార్డు కుటుంబానికే కొండంత అండ..
అక్టోబరు15 నుంచి పంటధాన్యాల కోనుగోలు కేంద్రాలు..
సందడి చేయాల్సింది పోయి బేజారయ్యారు..
హుజూర్ నగర్ బై పోరుకు సర్వం సిద్ధం..
సమస్యేదైనా పరిష్కరిస్తా..ఎన్‌ఆర్‌ఐలతో వైవీ
రాజకీయ శక్తుల చేతిలోకి ఆర్టీసీ సమ్మె..
అభిమానులు గర్వపడేలా నా కొత్త సినిమా
ఎన్ సిసితో నైపుణ్యం అభివృద్ధి..
పారదర్శక పాలనలో వైఎస్‌ జగన్‌ మరో అడుగు
పర్యాటకులకు గొప్పగా ఆతిధ్యం..ఆ హోటల్స్ ప్రత్యేకత
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.