ఐబీపీఎస్ ఇటీవల 12,075 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 7, 8, 14, 21 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు, 2020, జనవరి 19న మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు ఐబీపీఎస్ సిద్దన్నమైంది. పరీక్షకు ఇంకా 3 నెలల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో.. అభ్యర్థులు విజయం సాధించడానికి పాటించవలసిన అంశాలు మీకోసం..ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు.

ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్(30), న్యూమరికల్ ఎబిలిటీ (35), రీజనింగ్ ఎబిలిటీ (35) విభాగాలు ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్ష వ్యవధి గంట. ఈ పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు మెయిన్ రాసేందుకు అర్హులు.మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో 190 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయిస్తారు. మెయిన్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులు,  జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు-40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

పరీక్ష వ్యవధి 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు). ప్రతి విభాగానికి వేర్వేరుగా సమయం కేటాయించారు. ప్రతి విభాగంలోనూ నిర్దేశిత మార్కులు పొందాలి. అలాగే మొత్తంగా ఐబీపీఎస్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు సాధించాలి.ప్రిలిమినరీ పరీక్షలో కనీస అర్హత మార్కులను పేర్కొన్నప్పటికీ.. వాటిని తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. అలానే ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల్లో రుణాత్మక మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఆయా ప్రశ్నలకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు మార్కుల కోత విధిస్తారు.మొత్తం ఖాళీలు: 12,075 (ఆంధ్రప్రదేశ్-777, తెలంగాణ-612) ఉన్నట్లు తెలియా చేశారు.

అర్హత విషయానికి వస్తే  ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్‌‌జ ఉండాలి. వయసు పరిమితి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎక్సమ్ ఎంపిక విధానం  ప్రిల్రిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది అని తెలియచేసింది.దరఖాస్తులకు ప్రారంభ తేది: 17.09.2019 , దరఖాస్తులకు చివరి తేది: 09.10.2019 , ప్రిలిమినరీ పరీక్షతేది: 2019 డిసెంబరు 7, 8, 14, 21.మెయిన్ పరీక్షతేది: 19.01.2020. ఎగ్జామ్స్ ఉంటుంది అని ప్రకటించండి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ibps.in/ సంప్రదించగలరు.


మరింత సమాచారం తెలుసుకోండి: