తెలంగాణలో కొన్నాళ్లుగా పెద్దగా నోటిఫికేషన్లు లేవు.. మరోవైపు ఏపీలో జగన్ సీఎం అయిన దగ్గర నుంచి ఒకటే ఉద్యోగాలు.. ముందేమో గ్రామవాలంటీర్లు అన్నారు.. అవో 3,4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు సచివాలయ ఉద్యోగాల పేరుతో అవో లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చారు.


దీంతో తెలంగాణ నిరుద్యోగుల్లో మాకేమీ నోటిఫకేషన్లు లేవా అన్న నిరాశ మొదలైంది. ఈ సమయంలో కేసీఆర్ దాదాపు మూడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. తద్వారా కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఈ ఉద్యోగాలన్నీ విద్యుత్‌ శాఖకు సంబంధించినవి కావడం విశేషం.


టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌లో మొత్తం 2,939 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాల్లో మొత్తం మూడు రకాలు ఉన్నాయి. అవి జూనియర్ లైన్ మెన్, కంప్యూటర్ ఆపరేటర్, జేపీవో.


ఈ మూడు ఉద్యోగాల్లో అత్యధికంగా జూనియర్ లైన్ మెన్ ఉన్నాయి. అవి ఏకంగా 2,438 జూనియర్ లైన్‌మెన్‌ ఉద్యోగాలు ఉన్నాయి. వీటి తర్వాత అత్యధికంగా 477 కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక జేపీవో పోస్టులు కేవలం 24 మాత్రమే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: