అదో యూనివర్శిటీ.. ఇప్పుడు ఆ వీసీ పదవి కోసం ఫుల్ డిమాండ్ వచ్చింది. తెలంగాణలో 9 విశ్వవిద్యాలయాల వీసీ ఖాళీల భర్తీకి జులైలో ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. వీటికి 270 మంది నుంచి మొత్తం 984 దరఖాస్తులు అందాయి. అయితే అన్ని యూనివర్శిటీల కంటే ఎక్కువగా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవికి చాలా డిమాండ ఉందట.


ఒక్క ఈ వీసీ పోస్టు కోసమే 142 మంది ప్రొఫెసర్లు పోటీ పడ్డారట. అతి తక్కువగా తెలుగు విశ్వవిద్యాలయానికి 23 మందే దరఖాస్తు చేశారట. మొత్తం అభ్యర్థుల్లో ఒక్కొక్కరు కనీసం మూడు నుంచి అయిదారు వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నారట. 54 మంది ఏదైన ఒక వర్సిటీ అని రాశారు. అంటే వారు అన్ని యూనివర్శిటీలకు పోటీపడుతున్నట్టే.


మరి ఎందుకు ఎక్కువగా అంబేద్కర్ యూనివర్శిటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.. ఈ విషయం పరిశీలిస్తే.. అంబేడ్కర్ వర్సిటీకి నిధుల సమస్య లేదు. వేతనాలకు, ఇతర అవసరాలకు రాష్ట్రప్రభుత్వ బడ్జెట్ పై ఆధారపడదు. విద్యార్థుల ఫీజులతోనే నడిపించవచ్చు. దూరవిద్య కాబట్టి విద్యార్థి సంఘాల గోల ఉండదు. అందులోనూ హైదరాబాద్ లో ఉంటుంది. ఈ కారణాలతోనే ఈ యూనివర్శిటీకి ఫుల్ డిమాండ్ వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: