నిరుద్యోగ యువతీ యువకులు అందరూ కేంద్ర
ప్రభుత్వ ఉద్యోగాలలో అధ్యదికంగా పోటీ పడేది రైల్వే ఉద్యోగాలకే. రైల్వే లో ఉజ్వలమైన
భవిష్యత్తుతో పాటు సంస్థ అందించే సేవలు ఉద్యోగులకి ఎంతో ఊరటనిస్తాయి. అందుకే రైల్వే
లో ఉద్యోగ నోటిఫికేషన్ కి లక్షల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతాయి. తాజాగా సౌత్
వెస్ట్రన్ రైల్వే నుంచీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అయితే ఈ ఉద్యోగాలకి
కేవలం స్పోర్ట్స్ కోటా వారికి మాత్రమే. హుబ్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్
వెస్ట్రన్ రైల్వే ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగ వివరాలలోకి వెళ్తే..
పోస్టుల సంఖ్య : 21
క్రీడలు : అధ్లెటిక్స్ , బ్యాడ్మింటన్ ,బాడీ బిల్డింగ్ , క్రికెట్ , వెయిట్ లిఫ్ట్ , వాలీ బాల్ ,టేబుల్ టెన్నిస్, హాకీ
అర్హత : ఇంటర్మీడియట్ , తస్తమాన ఉత్తీర్ణత, అలాగే పైన తెలిపిన క్రీడల్లో జాతీయ , అంతర్జాతీయ దేశం ,రాష్ట్రం తరుపున ప్రానిధ్యం వహించి ఉండాలి.
వయసు : 18-25
ఎంపిక విధానం : ఫీల్డ్ ట్రైల్స్ ,క్రీడా ప్రతిభ , మెడికల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
చివరి తేదీ : 28-10-2019
మరిన్ని వివరాలకోసం : https://swr.indianrailways.gov