దేశంలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినప్పటికీ నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వాలు  పూలు స్టాప్ పెట్టలేకపోతూన్నాయి. ఇటీవల కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్ధిక మాంద్యం కారణంగా ఆటో మొబైల్ రంగంలో చాల మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో  నిర్మాణ్‌ టెక్‌ మహేంద్ర ఫౌండేషన్‌ ఉచితంగా ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. సాధారణంగా ఆసరా అందిస్తే అందలాన్ని అందుకోగలిగే యువతీ,యవకులు ఎంతోమంది.



అలాంటి వారి స్వావలంబన కోసం నిర్మాణ్‌ సంస్థ ఉచితంగా ఉపాధి శిక్షణ అందిస్తోంది. నిరుద్యోగ యువతీ యువకులకు, నిరుపేద మహిళలకు పలు అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి, నిపుణులుగా తీర్చిదిద్ది, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా క షిచేస్తోంది. విద్య, వైద్య రంగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను కూడా చేపట్టి వృత్తి నిపుణులను ప్రమోట్‌ చేస్తోంది. టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌, బిట్స్‌పిలానీ పూర్వ విద్యార్థులు ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్‌ తో కలిసి బీటెక్‌ లేదా కంప్యూటర్‌ అవగాహన ఉన్న ఏదైనా డిగ్రీ ప్యాసైనవారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.  



నిరుద్యోగ యువతీ యువకులకు ( హెచ్ టిఎంఎల్, సీఎస్ ఎస్, బూస్టస్ట్రాప్ , సిఓఆర్ ఈ జవా (ఓఓపిఎస్), ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ , పి హెచ్ పి,  డిజిటల్ మార్కెటింగ్ ) వంటి సాఫ్ట్‌వేర్‌ కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఇక్కడ శిక్షణ పొందిన వారు, కాపీజెమిని, డెల్ , విప్రో, నెక్సీఇలబ్స్  లాంటి ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. ఆసక్తిగల అభ్యర్థులు అమీర్‌పేట, ఆదిత్య ఎంక్లేవ్‌, నీలగిరి బ్లాక్‌ లోని నిర్మాణ్‌ టెక్‌ మహేంద్ర ఫౌండేషన్‌ శిక్షణ కేంద్రంలో ధరఖాస్తు చేసుకోవచ్చు.  మరిన్ని వివరాలకు 7675914735, 9515134735 నెంబర్లను సంప్రదించగలరు. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని సంబంధిత నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: