తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష ఫలితాలు వచ్చాయి. టీఆర్టీ - ఎన్జీటీ తెలుగు మాధ్యమం పోస్టుల ఫలితాలను టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు కన్నా ముందుగానే టీఎస్ పీఎస్సీ ఈ ఫలితాలను వెల్లడించింది.


శుక్రవారం సాయంత్రం కమిషన్ సమావేశంలో ఫలితాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తెలుగు మీడియం విభాగంలో 3,325 పోస్టులకు ఎంపికైన అభ్యర్థు జాబితాను విడుదల చేసింది. ఏజెన్సీ స్థానికత ధ్రువీకరణ పత్రాలపై స్పష్టత లేని కారణంగా కొందరి ఫలితాలు నిలిపేశారు. కోర్టు కేసుల కారణంగా 117 పోస్టుల ఫలితాలు నిలిపివేశారు.


అంతేకాదు.. వివిధ విభాగాల్లో అర్హులు లేని కారణంగా 74 పోస్టులు భర్తీ కాలేదని వివరించారు.కమిషన్ కార్యదర్శి వాణి ప్రసాద్ వెల్లడించారు. దివ్యాంగ విభాగంలో 270 పోస్టులకు ఫలితాలు త్వరలో వెల్లడిస్తామని కమిషన్ కార్యదర్శి వాణి ప్రసాద్ మీడియాకు తెలిపారు. ఈ ఫలితాల వివరాలను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్లో చూసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: