విద్యార్థినీలను లైంగిక వేధించిన   ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ ఎన్.  సూర్య రాఘవేంద్ర సస్పెండ్ అయ్యారు.  రాఘవేంద్ర పై లైంగిక ఆరోపణలు రావడంతో,  అంతర్గత విచారణ చేపట్టిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్  అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగాధిపతి రాఘవేంద్ర గత కొంత కాలంగా విద్యార్థినులను లైంగికంగా వేధించడమే కాకుండా,  తన కామ వాంఛ తీర్చాలంటూ ఒత్తిళ్లు తీసుకు రావడంతో పలువురు విద్యార్థిని లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసింది.  


  అధ్యాపకుడు అయి ఉండి విద్యార్థినులతో రాత్రిపూట చాటింగ్ చేయాల్సిన అవసరం ఏముందని ఈ సందర్భంగా అంతర్గత విచారణ  చేపట్టిన వైస్ ఛాన్సలర్ను   మహిళలు  ప్రశ్నించారు.  రాఘవేంద్ర పై చర్యలు తీసుకోవాలని ఆయన్ని కఠినంగా  శిక్షించాలని డిమాండ్ చేశారు . రాఘవేంద్ర ఆగడాలను  విద్యార్థినీలు    ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దృష్టికి లేఖ రూపం లో  తీసుకువెళ్లగా ,  విద్యార్థినిల లేఖ పై వెనువెంటనే  స్పందించి చర్యలు చేపట్టిన జగన్ కు  ఈ సందర్భంగా మహిళలు  కృతజ్ఞతలు తెలిపారు.  


ఈ బాగోతం వెలుగులోకి వచ్చిన వెంటనే ముఖ్య మంత్రి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని  ఉన్నత విద్యాశాఖ అధికారులను  ఆదేశించారు.  వీసీ చేపట్టిన అంతర్గత విచారణ  సందర్బంగా   యూనివర్సిటీ వద్దకు చేరుకున్న పలువురు మహిళలు రాఘవేంద్ర చేసిన తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా రాఘవేంద్ర సాగించిన వేధింపులను వైస్ ఛాన్సలర్  దృష్టికి తీసుకు వచ్చారు.  అలాగే రాఘవేంద్రను  పలు అంశాలపై వారు నిలదీశారు. వీసీ ని కలిసిన వారిలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి , షర్మిలారెడ్డి లు ఉన్నారు .  రాఘవేంద్ర ఆగడాలను ప్రశ్నించడమే కాకుండా , అతన్ని వెంటనే  సస్పెండ్ చేయాలనీ వారు డిమాండ్ చేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: