దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. ఓవైపు ఆర్థిక మాంద్యం తరుముకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు చాలావరకూ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. మరోవైపు ఏకంగా ప్రభుత్వాలు కూడా అదనపు భారాన్ని దించుకుంటున్నాయి.


తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఏకంగా హోంగార్డులను ఉద్యోగాల్లోంచి తొలగించడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉత్తర ప్రదేశ్ లోని సీఎం యోగి సర్కారు 30 వేల మంది హోంగార్డులను ఉద్యోగాల్లోంచి తొలగించినట్టు వార్తలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లోకెళ్లా చాలా తక్కువ జీతం ఉండే ఉద్యోగం హోంగార్డు.


పేరుకే ప్రభుత్వోద్యోగం తప్ప ఉద్యోగానికి భరోసా ఉండదు. ప్రమోషన్లు ఉండవు..అరకొర జీతం. ఇలాంటి చాలీచాలని జీతాలతో బతుకు వెళ్లదీసే 30వేల కుటుంబాలకు ఆ మాత్రం ఆసరా కూడా తీసేయడం అమానుషంగానే చెప్పుకోవచ్చు.


దేశంలో పరిస్థితి ఇలా ఉంటే. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం హోంగార్డులకు శుభవార్త చెప్పారు. హోంగార్డులకు ఇచ్చే డైలీ అలవెన్స్‌ రూ.710కి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల దాదాపు ఒక్కో హోంగార్డుకు 2 వేల రూపాయల నుంచి 3 వేల రూపాయల వరకూ నెలజీతం పెరిగే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: