ఆంధ్రప్రదేశ్‌ లోని నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగ యువత నెలకు కనీసం రూ. 20 వేల రూపాయల ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతను గుర్తించి ఈ అవకాశం కల్పిస్తారు.


రాష్ట్రంలోని రవాణాకు సంబంధించిన ప్రతి వాహనాన్ని లబ్ధిదారులను గుర్తిస్తుంది. ప్రభుత్వమే వాహనాలు ఇప్పించి నిరుద్యోగ యువతకు రూ.20 వేలు ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ఐదేళ్లు పూర్తి అయ్యేలోగా అప్పు తీరి ఆ వాహనం మిగిలిపోయేలా ప్రణాళిక రూపొందించింది.


ఈ పథకం పారదర్శకంగా అమలయ్యేందుకు జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ప్రతి నియోకవర్గానికి ఒకటి, ప్రతి పార్లమెంట్‌లో ఒక రిజర్వ్‌ ఉంచుకునేందుకు బోర్లు వేసే డ్రిల్లింగ్‌ మిషన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.


గతంలో డబ్బున్న వారికి, రాజకీయ పార్టీలో పలుకుబడి ఉన్న వారికే గతంలో వాహనాలు అందించేవారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్‌లో సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలే వాహనాలు తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో అలా ఉండదని అర్హులకే అవకాశాలు దక్కుతాయని వైసీపీ సర్కారు చెబుతుంది. మరి చెప్పిన మాటలు ఎంత వరకూ అమలవుతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: