విద్యుత్‌తో నడిచే ఈ ఇండక్షన్ స్టవ్ లు వచ్చి చాలా ఏళ్లయింది. విద్యుత్‌శక్తిని ఉష్ణశక్తిగా మారుస్తూ వంటింటి చికాకులకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది ఇండక్షన్‌ స్టవ్‌. అయితే ఈ కరెంట్‌ పొయ్యి వాడకంలో కొన్ని ప్రమాదాలున్నాయి. వండే సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ఇబ్బందులే. వాటిని ఎదుర్కో వాలంటే కొన్ని టిప్స్‌ ఫాలో అయితే సరిపోతుంది. వండే సమయంలో స్టవ్‌పై నీళ్లు కానీ, ఇతర ద్రవపదార్థాలు కానీ పడకుండా చూసుకోవాలి. లేకపోతే స్టవ్‌ మన్నిక తగ్గడంతో పాటు ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.


ఇండక్షన్‌ స్టవ్‌లను క్లీన్‌ చేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెత్తటి పొడి బట్టతో శుభ్రం చేయాలి. నీటితోగానీ తడిబట్టతో వీటిని క్లీన్‌ చేయకూడదు. ఇండక్షన్‌ స్టవ్‌లకు మన్నికైన స్విచ్‌బోర్డు ద్వారా కరెంట్‌ సరఫరా అయ్యేలా చూడాలి. ఎక్స్‌టెన్షన్‌ బాక్స్‌లను వాడటం వల్ల విద్యుత్‌ ప్రమాదాలు సంభవించవచ్చు. మెటల్‌ ప్యానల్‌ ఉన్న పాత్రలనే వాడాలి. వంట పూర్తయిన తర్వాత స్టవ్‌ పైనుంచి పాత్రలను తీసేటప్పుడు స్విచ్ఛాప్‌ చేయడం మరచిపోకూడదు.


ఇండక్షన్‌ స్టవ్‌ నుంచి తీవ్రమైన వేడి వెలువడుతుంది. స్టవ్‌ దగ్గర్లో ప్లాస్టిక్‌ వస్తువులు, బట్టలు ఉంచడం ప్రమాదకరం. వంట పూర్తయిన తర్వాత కేవలం స్విచ్ఛాప్‌ చేసేసి ఊరుకోవద్దు. పిన్‌ నుంచి ప్లగ్‌ను తొలగించడమూ తప్పనిసరని గ్రహించాలి. వంట చేస్తున్నప్పుడు ఆహారాన్ని కలపడానికి లోహపు చెంచాలకు బదులుగా ఫైబర్, చెక్కతో చేసినవి  వినియోగించడం మంచిది. దీనివల్ల పాత్రలో ఉత్పత్తయ్యే స్వల్పస్థాయి విద్యుత్ మన శరీరానికి చేరే అవకాశం ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: