బంగారం పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి.. అదేంటో బంగారం ధరలు అసలు స్థిరంగా లేవు.. ఒక రోజు బంగారం భారీగా తగ్గితే మరో రోజు భారీగా పెరుగుతాయి. ఈమధ్యకాలంలో ప్రతి రోజు పెరుగుతూ తగ్గుతూ ఉండే ఈ బంగారం.. ఈ మధ్యకాలంలో మరి దారుణంగా తయారు అయ్యింది. అయితే ఒకసారి 20 రూపాయిలు బంగారం తగ్గితే మరుసటి రోజు 200 రూపాయిలు పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 

 

నేడు గురువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయిల తగ్గుదలతో 41,480 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 340 రూపాయిల తగ్గుదలతో 38,020 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర అంతకు మించి తగ్గింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 600 తగ్గుదలతో 48,000 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 

 

విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు ఇంకా ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పసిడి ప్రేమికులు బంగారం కావాల్సినంత కొంటారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: