అవును.. ఈరోజు బంగారం ధరలు చూశారు అంటే నిజంగానే వావ్ అనకుండా ఉండలేరు.. ఆలా ఉన్నాయి బంగారం ధరలు. ఇకపోతే ఈ బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఎంత భారీగా పెరుగుతున్నాయి అంటే ? సామాన్యులు ఆ బంగారం ధరలు చూసి మాకు వద్దులే బాబు ఈ బంగారం. మరేదైనా తీసుకుంటాంలే అనేంతలా బంగారం ధరలు పెరిగాయి. 

 

ఇక పోతే ఈ బంగారం ధరలు నేడు శనివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 42,430 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 39,810 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 49,900 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగింది. 

 

గత 3 రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి.. దీనికి కారణం అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరిగింది అని అందుకే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు సాధారణ స్థితికి ఎప్పుడు వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: