బంగారం ధరలు ఎంత దారుణంగా తయారు అయ్యాయి అంటే? బంగారం ధరలు.. ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి.. రోజుకో రూపంలో బంగారం ధరలు ఉంటున్నాయి.. మొన్నటికి మొన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా భారీగా పతనం అయ్యాయి. గత కొద్దీ రోజులుగా బంగారం ధర భారీగా పెరిగింది. ఈ బంగారం ధరలో ఈ మధ్య ఏమాత్రం స్థిరత్వం లేదు.. అలాంటి ఈ బంగారం ధర ప్రస్తుతం భారీగా పతనం అయ్యింది. 

 

ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు గురువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 360 రూపాయిల తగ్గుదలతో 44,340 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 360 రూపాయిల తగ్గుదలతో 40,610 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర కూడా భారీగా తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 200 రూపాయిల తగ్గుదలతో 49,800 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

 

ఇంత తగ్గినప్పటికీ ఈ బంగారంను ప్రస్తుతం కొనలేని పరిస్థితి.. ఎందుకంటే బంగారం ధర కేవలం ఒక్క వారంలోనే 3వేలు పెరిగింది కాబట్టి.. అలాంటి ఈ బంగారం ధర ఇప్పుడు తగ్గిన పెద్దగా ప్రయోజనాలు లేవు.. ఎందుకంటే తులం బంగారానికి 40 వేలు పెట్టాలంటే చాలా కష్టం కాబట్టి.. మరి ఈ బంగారం సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: