బంగారం ధరలు ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు.. కరోనా వైరస్ ఎఫెక్ట్ అని బంగారం ధరలు ఒకటికి మించి మరొకటి పెరిగిపోయాయి. ఇప్పుడు బంగారం ధరలు ఏకంగా తులం 40 వేలు పలుకుతుంది. ఇంకా ఈ సమయంలో బంగారం ధరలు భారీగా తగ్గి ఉరటనిచ్చాయి. అలాంటి ఈ బంగారం ధరలు ఇప్పుడు షాక్ కి గురి చేస్తున్నాయి. ఆ షాక్ చూస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. 

 

నిన్నటికి నిన్న 950 రూపాయిలు తగ్గింది.. ఇప్పుడు ఏకంగా 650 రూపాయిలు పెరిగింది. ఇంకా 400 పెరుగుతుంది. ఇలా బంగారం ధరలు తగ్గినా దానికంటే పెరగటమే తప్ప తగ్గేది ఏమి లేకుండా పోయింది అంటే నమ్మండి. ఇంకా అలాంటి ఈ బంగారం.. వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నేడు గురువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 670 రూపాయిల పెరుగుదలతో 42,970 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 690 రూపాయిల పెరుగుదలతో 39,390 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో నేడు కేజీ వెండి ధర 41,780 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. 

 

అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారం, వెండిపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే బంగారంపై భారీగా ధరలు పెరిగాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: