ఛీఛీ.. ఈ కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు పెరిగేదే ఉంది కానీ తగ్గేది లేదు అన్నట్టు ఉంది. ఈ కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ నష్టాల్లో మునిగిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు.. అందరూ ఇన్వెస్ట్ చేస్తే బంగారం ధరలు పెరగకుండా ఉంటాయా.. అలానే ఈరోజు పెరిగాయి. 

 

ఇకపోతే.. బంగారం ధరలు పెరిగిన.. తగ్గిన పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా ఇంటి నుండి బయటకు రాకూడదు.. కాబట్టి షాపులు అన్ని కూడా క్లోజ్ ఉంటాయి. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందరూ ఇళ్లల్లోనే ఉండాలి. అలా ఇంట్లో ఉండేవారికి బంగారం ధరల గురించి అవసరమా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. 

 

ఇకపోతే ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. నేడు ఆదివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిల పెరుగుదలతో 43,270 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 570 రూపాయిల పెరుగుదలతో 39,660 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర స్వల్పంగా పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 50 రూపాయిల పెరుగుదలతో 41,780 రూపాయిలకు చేరింది. 

 

అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారం, వెండిపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే బంగారంపై భారీగా ధరలు పెరిగాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: