పసిడి ధర పరుగులు పెడుతోంది. ప్ర‌స్తుతం ప‌స‌డి ధ‌ర‌ల పెరుగుద‌ల చూస్తే ఇప్ప‌ట్లో అస‌లు బంగారం కొన‌గ‌ల‌మా ? అన్న సందేహాలు సైతం వ్య‌క్త మ‌వుతున్నాయి. ఏదేమైనా మ‌రోవైపు పెళ్లిళ్ల సీజ‌న్ ప్రారంభం కావ‌డంతో దేశ‌వ్యాప్తంగా బంగారం కొనాల‌నే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇప్పుడు వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు రోజు రోజుకు తెగ పెరుగుతున్నాయి. గ‌త రెండు మూడు రోజులుగా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. 

 

ప్ర‌స్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.600 పెరుగుదలతో రూ.43,270కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ర్యాలీ చేసింది. 10 గ్రాముల బంగారం ధర రూ.570 పెరుగుదలతో రూ.39,660కు ఎగసింది. ఇక ప‌సిడి ధ‌ర‌ల‌కు బ్రేకులు వేయ‌డం క‌ష్ట‌మైతే వెండి కూడా అదే రూట్లో వెళుతోంది. కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో వెండి ధర రూ.40,550కు పరుగులు పెట్టింది. అటు ఉత్ప‌త్తులు త‌గ్గ‌డం.. ఇటు డిమాండ్ ఎక్కువుగా ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం అని చెప్పాలి. 

 

ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీ మార్కెట్లో చూస్తే బంగారం రేటు ఏకంగా రు. 600 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరుగుదలతో రూ.40,500కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.600 పెరుగుదలతో రూ.41,700కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.50 పెరుగుదలతో రూ.40,550కు చేరింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్లోనూ, దేశీయ మార్కెట్లోనూ బంగారం రేటు పెరుగుద‌ల‌కు చాలా కార‌ణాలు ఉన్నాయి. ద్ర‌వ్యోల్బ‌ణం, అంత‌ర్జాతీయ మార్కెట్లో ఉత్ప‌త్తి త‌గ్గి డిమాండ్ పెర‌గ‌డం... క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: