బంగారం పెరుగుదలకు నిన్న బ్రేకులు పడ్డాయి. కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అలాంటి ఈ బంగారం ధరలు నిన్న ఒక్క రోజే 1,925 రూపాయిలు తగ్గింది.. ఇంకా అలాంటి ఈ బంగారం ధర ఈ ఒక్క రోజే ఎంత తగ్గింది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

నిన్న బంగారం తగ్గినప్పటికీ నేడు స్వల్పంగా బంగారం ధర పెరిగింది అనే చెప్పాలి.. నేడు సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యరెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 43,375 రూపాయలకు చేరింది. ఇంకా అలానే 10 గ్రాముల 22 క్యరెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 39,519 రూపాయలకు చేరింది. 

 

బంగారం ధర భారీగా పెరగగా వెండి ధర స్వల్పంగా పెరిగింది. వారం రోజుల్లో కేజీ వెండి ధరపై 10 వేలు తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ పెరుగుతుంది. దీంతో ఈరోజు కేజీ వెండి ధరపై 10 పెరుగుదలతో 39,510 రూపాయలకు చేరింది. అయితే ప్రస్తుతం బంగారం ధరలు ఎంత తగ్గిన ఉపయోగం లేదు. ఎందుకంటే దేశమంతా వెతికిన ఏ బంగారం షాపు తెరవలేదు. కారణం కరోనా వైరస్.. ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: