కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు ఎంత భారీగా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ కరోనా దెబ్బకు ఒకానొక సమయంలో తులం బంగారం ధర ఏకంగా 44వేలకు చేరింది. అలాంటి ఈ బంగారం ధర ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తుంది. గత నాలుగు రోజుల నుండి బంగారం ధరలు అతి భారీగా తగ్గుతున్నాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు గురువారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 80 రూపాయిల తగ్గుదలతో 43,080 రూపాయలకు చేరింది. ఇంకా అలానే 22 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయిల తగ్గుదలతో 39,440 రూపాయలకు చేరింది. 

 

బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర ఏకంగా 460 రూపాయిలు తగ్గుదలతో 39,940 రూపాయిలకు చేరింది. అయితే కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు భారీగా పెరగగా.. వెండి ధరలు మాత్రం ఏకంగా 10వేలు తగ్గింది. దీంతో 51 వెయ్యి ఉండే ఈ బంగారం ధర ప్రస్తుతం 39వేలకు చేరింది. అయితే బంగారం ధరలు ఎంత తగ్గిన.. ఎంత పెరిగిన బయటకు వెళ్లి కొనే  పరిస్థితి లేదు. ఎందుకంటే దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుంది కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: