నాలుగు రోజుల బంగారం తగ్గుదలకు నేడు బ్రేకులు పడ్డాయి.. కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న ఈ సమయంలో బంగారం ధరలు ఏకంగా 2 వేలు తగ్గింది. అలాంటి బంగారం ధర తగ్గుదలకు నేడు మళ్లీ బ్రేకులు పడ్డాయి. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి.. తగ్గిన సమయంలో 10 రూపాయిలు.. 20 రూపాయిలు తగ్గి ఇప్పుడు ఏకంగా 200 రూపాయిలు పెరుగుతుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 290 రూపాయిల పెరుగుదలతో 43,270 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 280 రూపాయిల పెరుగుదలతో 39,730 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 220 రూపాయిల పెరుగుదలతో 40,160 రూపాయిలకు చేరుకుంది. కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: