బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయి అర్థం కావడం లేదు.. ఒకరోజు తక్కువ ఉంటే మరో రోజు ఎక్కువ ఉంటున్నాయి. ఎప్పుడు తగ్గుతూ.. పెరుగుతూ ఉంటున్న ఈ బంగారం ధరలు మొన్న నాలుగు రోజులు భారీగా తగ్గాయి.. ఏకంగా వేలలో తగ్గాయి. అయితే ఇప్పుడు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి అనుకోండి.. ఇంకా ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు భారీగా పెరిగాయ్. 

 

నేడు శనివారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 710 రూపాయిల పెరుగుదలతో 43,980 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 230 రూపాయిల పెరుగుదలతో 39,960 రూపాయలకు చేరింది.

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 110 రూపాయిల పెరుగుదలతో 40,270 రూపాయిలకు చేరుకుంది. కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. అయితే బంగారం, వెండి ధరలు ఎంత తగ్గిన.. ఎంత పెరిగిన పెద్దగా ఉపయోగం లేదు అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: