బంగారం ధరలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఆకాశాన్ని తాకినా బంగారం ధర ఇప్పుడు మళ్లీ పెరిగింది. ఈ పెరుగుదల చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.. అంత పెరిగింది బంగారం ధర. 

 

ఇంకా అలాంటి బంగారం వెండి ధరలు ఎంత పెరిగాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1150 రూపాయిల పెరుగుదలతో 45,650 రూపాయలకు చేరింది. ఇంకా అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1010 రూపాయిల పెరుగుదలతో 41,850 రూపాయలకు చేరింది. 

 

బంగారం ధరలు భారీగా పెరగగా.. వెండి ధరలు కూడా అలానే పెరిగాయ్. కేజీ వెండి ధర 610 రూపాయిల పెరుగుదలతో 41,910 రూపాయలకు చేరింది. అంతరాజాతీయంగా బంగారంపై బాగా డిమాండ్ ఏర్పడింది అని.. అందుకే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏమైతేనేం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: