బంగారం ధరలు మొన్నటి వారు భారీగా తగ్గాయి.. కానీ నిన్నటికి నిన్న బంగారం ధరల తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగాయ్. నిన్న ఆరు వందలు పెరిగింది.. నేడు ఆరు వందలు పెరిగింది.. ఇలా బంగారం ధరలు 5 రోజులకు గాను రెండు వేలు తగ్గితే పెరగడం మాత్రం కేవలం మూడు రోజుల్లోనే తగ్గినడానికి మిచ్చి పెరుగుతున్నాయి.

 

కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ లు అతి దారుణంగా పడిపోవడంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులకు అందనంత రేంజ్ లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇంకా మొన్న తగ్గాయి అనుకుంటే మళ్లీ పెరుగుతున్నాయి.. ఇంకా అలాంటి ఈ బంగారం ధరలు ఈరోజు కూడా పెరిగాయి. 

 

హైదరాబాద్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 520 రూపాయిల పెరుగుదలతో 45,300 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 610 రూపాయిల పెరుగుదలతో 41,660 రూపాయలకు చేరింది. 

 

అయితే ఈరోజు కేవలం బంగారం ధరలు మాత్రమే పెరగలేదు... వెండి ధరలు కూడా అలానే పెరిగాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 1,010 రూపాయిల పెరుగుదలతో 42,420 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయ్. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అయితే బంగారం ధరలు ఇలా పెరగటానికి కారణం అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా ఉంది అని అంటున్నారు మార్కెట్ నిపుణులు.                               

మరింత సమాచారం తెలుసుకోండి: