బంగారం ధర.. అనుకుంటాం కానీ.. తలచుకుంటేనే చిరాకు పుడుతుంది.. ఎంత కరోనా దెబ్బ అయితే మాత్రం బంగారం సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగితే ఎలా? గత రెండు నెలలుగా హద్దు అదుపు లేకుండా పెరుగుతుంది. బంగారం ముట్టాలి అన్న భయం వేసేలా బంగారం పెరిగింది. ఇంకా అలాంటి ఈ బంగారం ధర ఈరోజు కూడా పెరిగింది. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 190 రూపాయిల పెరుగుదలతో 47,190 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 180 రూపాయిల పెరుగుదలతో 44,420 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధరలు భారీగా తగ్గాయి.. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 200 రూపాయిల తగ్గుదలతో 41,640 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. అయితే ఇలా బంగారం ధరలు పెరుగుదలకు కారణం కరోనా వైరస్ ఏ అని.. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి అని.. దీంతో ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు అని.. అందుకే బంగారం ధరలు భారీగా పెరిగాయ్ అని అంటున్నారు మార్కెట్ నిపుణులు.     

 

ఇకపోతే బంగారం ధరలు పెరిగిన తగ్గిన కొనే పరిస్థితి లేదు.. దీనికి కారణం కూడా కరోనా వైరస్ ఏ. ఎలా అంటారా? కరోనా వైరస్ నియంత్రణకై దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో దేశంలో ఎక్కడ కూడా బంగారం షాపులు తెరవలేదు. ఎందుకంటే బంగారం నిత్యావసరం కాదు కాబట్టి.                                  

మరింత సమాచారం తెలుసుకోండి: