బంగారం ధరలు ఎలా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్. ఈ వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలిపోయాయి. దీంతో బంగారం, వెండి ధరలు అత్యంత దారుణంగా పెరిగిపోయాయి. 

 

ఇంకా బంగారం ధరలు ఇప్పుడు పెరిగినప్పటికీ అప్పుడప్పుడు తగ్గుతూనే ఉన్నాయ్. ఒక రోజు వెయ్యి రూపాయిలు తగ్గితే.. మరో రోజు 500 పెరుగుతుంది.. ఇలా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మంచి విషయం చెప్తూ భారీగా పతనమయ్యాయి. 100, 200 కాదు ఏకంగా 400 రూపాయిలు తగ్గిపోయాయి. ఇంకా ఇప్పుడు ధరలు ఏలా ఉన్నాయో చుడండి. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా భారీగా పతనమయ్యాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయిల తగ్గుదలతో 46,700 రూపాయలకు చేరింది. ఇంకా అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 490 రూపాయిల తగ్గుదలతో 43,950 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధర భారీగా పెరిగింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 1,010 రూపాయిల పెరుగుదలతో 42,520 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలోను బంగారం ధరలు ఇలానే భారీగా కొనసాగుతున్నాయి. ఇకపోతే బంగారం వెండి ధరలు ఎంత తగ్గిన ప్రస్తుతం ఉపయోగం లేదు.. ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుంది.                                            

మరింత సమాచారం తెలుసుకోండి: