బంగారం ధరలు చాల దారుణంగా ఉంటున్నాయి .. ఎప్పుడు ఎలా ఉంటున్నాయో కూడా అర్థం కావడం లేదు.. రోజుకు ఒకలా ఈ బంగారం ధరలు ఉంటున్నాయి. ఇంకా ఈ కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు దారుణంగా పెరుగుతున్నాయి.. కేవలం రెండు నెలల్లో బంగారం ధర ఏకంగా ఆరు వేల రూపాయిలు పెరిగింది. 

 

ఎందుకు అంటే కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు అతి దారుణంగా కుప్పకూలిన సంగతి తెలిసిందే.. దీంతో ఇన్వెస్టర్లు.. అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేశారు.. దీంతో బంగారం ధర ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. ఇకపై సామాన్యులు ఈ బంగారాన్ని కొనలేరు అని ఫిక్స్ అయ్యారు.. 

 

అయితే చాలా రోజుల తర్వాత బంగారం స్థిరంగా కొనసాగుతుంది.. ఎప్పుడు పెరుగుతు తగ్గుతూ ఉండే ఈ బంగారం ధర ఇప్పుడు స్థిరంగా కొనసాగుతుంది. అయితే బంగారం ధర ఇలా స్థిరంగా కొనసాగడానికి కారణం అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా తగ్గింది అని.. అందుకే ఇలా అయ్యింది అని అంటున్నారు మార్కెట్ నిపుణలు.                                           

 

ఇకపోతే నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇంకా అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 44,200 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇంకా వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 42,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: