బంగారం ధరలు ఎంత దారుణంగా ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారం ధరలు రోజురోజుకు అతి దారుణంగా పెరిగిపోతున్నాయి.. ఇంకా ఎప్పటికప్పుడు తగ్గినట్టు కనిపిస్తూ భారీగా పెరుగుతున్న బంగారం నేడు కూడా మళ్లీ భారీగా పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర సామాన్యులకు బహు దూరం అయ్యింది అనే చెప్పాలి. ఎందుకంటే బంగారం ధరలు సామాన్యులకు అనుకూలంగా లేవు.. భారీగా పెరిగాయి.

 

కరోనా వైరస్ కారణంగా మరి భారీగా పెరిగాయ్. నేడు బంగారం ధరలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. అలా ఉంటాయి ఆ ధరలు. కరోనా కారణంగా స్టాక్ మార్కెట్ లు దారుణంగా పడిపోయాయి.. దీంతో ఇన్వెస్టర్లు  అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు.. దీంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయ్.

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయిల పెరుగుదలతో 44,840 రూపాయలకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయిల పెరుగుదలతో 47,770 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. దీంతో నేడు కేజీ వెండి ధర 2,100 రూపాయిలు పెరుగుదలతో 45,250 రూపాయలకు చేరింది. ఇంకా ఢిల్లీ మార్కెట్ లోను బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

 

అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగడంతోనే బంగారం ధరలు భారీగా పెరిగాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి అలాంటి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. అయితే ఎంత తగ్గినా.. ఎంత పెరిగినా ఈ లాక్ డౌన్ పెద్దగా ఉపయోగం లేదు.. ఎందుకంటే బయట ఎక్కడ కూడా బంగారం షాపులు ఓపెన్ చెయ్యలేదు.. చేసిన కూడా ఉపయోగం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: