భారతీయులకు బంగారంపై  మోజు ఎక్కువ. ప్రతీ ఒక్కరూ తమస్థాయి కి తగినట్లుగా బంగారాన్ని  కొనుగోలు చేస్తుంటారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇతరాత్ర అవసరాలకు బంగారం ఉపయోగపడుతుందని భావిస్తుంటారు. అయితే ఇప్పుడిక సామాన్యుడికి బంగారం కొనే అవకాశాలు లేకుండా పోయాయి. బంగారం ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.

 

కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు కేవలం అంటే కేవలం రెండు నెలల్లో ఏకంగా 8 వేలు పెరిగింది.. 36 వేలు ఉండే బంగారం ధర కాస్త ఇప్పుడు 45 వేలకు చేరింది. కరోనా కారణంగా స్టాక్ మార్కెట్ లు కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంది. 

 

ఇంకా అలాంటి ఈ బంగారం ధర నేడు హైదరాబాద్ మార్కెట్ లో ఇలా కొనసాగుతుంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 45,570 రూపాయలకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయిల పెరుగుదలతో 44,540 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 10 రూపాయిలు పెరుగుదలతో 46,710 రూపాయలకు చేరింది. ఇంకా ఢిల్లీ మార్కెట్ లోను బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగడంతోనే బంగారం ధరలు భారీగా పెరిగాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి అలాంటి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

 

అయితే ఎంత తగ్గినా.. ఎంత పెరిగినా ఈ లాక్ డౌన్ లో పెద్దగా ఉపయోగం లేదు.. ఎందుకంటే బయట ఎక్కడ కూడా బంగారం షాపులు ఓపెన్ చెయ్యలేదు.. చేసిన కూడా ఉపయోగం లేదు. ఈ నెల 31 వరుకు తాజాగా లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే.. కరోనా రేంజ్ లో బంగారం ధర పెరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: